కుటుంబ కథా చిత్రాల హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి లయ. అచ్చతెలుగమ్మాయి అయిన లయ చేసిన సినిమాలన్నీ ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలే. జాతీయ స్థాయిలో చెస్ క్రీడా కారిణిగా పేరు తెచ్చుకున్న లయ రెండో తరగతిలో వున్నప్పుడే చదరంగంలో మంచి పేరు సంపాదించింది. రాష్ట్రస్థాయిలో ఏడుసార్లు, జాతీయస్థాయిలో ఒకసారి పతకాలు కూడా సాధించింది. అదే విధంగా 10 తరగతి వరకు చదరంగం పోటీలలో పాల్గొంది.
లయ 5వ తరగతి నుంచే సంగీతం, కూచిపూడి డాన్స్ నేర్చుకుంది. అక్కినేని కుటుంబరావు తీసిన భద్రం కొడకో సినిమాలో బాల నటిగా లయ నటించింది. హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమా స్వయంవరం. కొత్త నిర్మాత, కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త రచయిత.. ఇలా అందరూ కొత్త టీం కలిసి చేసిన స్వయంవరం సినిమా లయకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాకి సంగీతం మణిశర్మ. కీరవాణి రాగంలో అనే పాట లయను బాగా ఎస్టాబ్లిష్ చేసింది.
ఈ సినిమాలో లయ అందాలకు తెలుగు యూత్ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత లయ హోమ్లీ క్యారెక్టర్లతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. స్వయంవరం తర్వాత దాదాపు ముప్పై సినిమాలలో హీరోయిన్‌గా నటించి పాపులర్ అయింది. లయకి ఎక్కువగా పేరు తెచ్చిన సినిమాలు ప్రేమించు, మనోహరం, మనసున్న మారాజు, నీ ప్రేమకై, దేవుళ్ళు వంటి చిత్రాలు. అయితే, హీరోయిన్‌గా క్రేజ్ వచ్చాక లయ డేట్స్ సురేష్ కొండేటి చూసేవారట.
అలా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడటంతో నాగార్జున నటించిన సంతోషం సినిమాను ఆంధ్రాలో ఓ ఏరియా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసేందుకు హక్కులను కొన్నాడు. ఆ సమయంలో సురేష్ కొండేటికి ఆర్ధికంగా సపోర్ట్ చేసింది లయ అని కొంతమంది చెప్పుకుంటుంటారు. ఇద్దరి మధ్య మంచి బంధం ఉన్న కారణంగా కొత్తగా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగబోతున్నందుకు లయ సపోర్ట్ చేస్తూ మరే విధమైన లాభం ఆశించకుండా డబ్బు సర్దుబాటు చేసిందట.
అలా ఆరోజు లయ సురేష్ కొండేటికి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయడంతో సంతోషం సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసి మంచి లాభాలను పొందాడు. అదే ఉత్సాహంతో అటు మెగాస్టార్ చిరంజీవి ఇటు నాగార్జునల సహకారంతో సంతోషం మ్యాగ్జైన్‌ని మొదలు పెట్టాడు. ఆ తర్వాత నిర్మాతగా, డబ్బింగ్ సినిమాలను కొన్ని తెలుగులో రిలీజ్ చేస్తూ బాగా సంపాదించాడు. ఇప్పుడ మెగా కాంపౌండ్‌లో కీలకంగా ఎదిగాడు.
ప్రతి యేటా సంతోషం ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తూ ఇండస్ట్రీలోని ప్రముఖులందరికీ అవార్డులు ప్రధానం చేస్తూ ఇండస్ట్రీలో ఓ ముఖ్యమైన వ్యక్తిగా నిలబడ్డాడు. అయితే, ఇదే సురేష్ కొండేటిపై కొన్ని రూమర్స్ కూడా అపుడప్పుడూ వినిపిస్తుంటాయి. మొత్తానికి లయ వల్లే సురేష్ ఇంతటి స్థానానికి వచ్చాడని చెప్పుకోవడం ఆసక్తికరమైన విషయమే.