నేచురల్ స్టార్ నాని దూకుడుకు బ్రేకులు పడుతున్నాయి. నాని స్వయంకృతాపరాథంతోనే నాని క్రేజ్ తగ్గుతోందా… ఆయన్ను కొందరు ఇండస్ట్రీలో టార్గెట్ చేయడం కూడా ఆయన సినిమాలు బాగున్నా బ్యాడ్ ట్యాక్ స్పీడ్‌గా స్ప్రెడ్ అవుతోందా ? అంటే తాజా పరిణామాలు అవుననే చెపుతున్నాయి. అసలు నాని కెరీర్ గత ఆరేడేళ్లుగా చూస్తే చాలా స్పీడ్‌గా ఉంటోంది. ఒక్క యేడాదిలో వరుసగా నాలుగైదు సినిమాలు లైన్లో పెట్టుకుంటూ పోతున్నాడు.
అసలు కరోనా టైంలో కూడా వి- టక్ జగదీష్ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేశాడు. అంతెందుకు గత ఆరు నెలల్లో కూడా నాని నటించిన రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. శ్యామ్సింగరాయ, తాజాగా అంటే సుందరానికి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఇప్పుడు నాని చేతిలో ఒక్క దసరా సినిమా మాత్రమే ఉంది. అది కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది.
ఓ సినిమా కంప్లీట్ అయిన వెంటనే మరో సినిమాను లైన్లో పెట్టేసే నాని చేతిలో దసరా తర్వాత ఏ సినిమాలు ఉన్నట్టు లేవు. మరి ఈ బ్రేక్‌కు కారణం ఏంటన్నది ? చూస్తే నాని సినిమాలు చేస్తున్నా సరైన కమర్షియల్ హిట్ లేదు. ఎంసీయే సినిమా తర్వాత నాని రేంజ్ కమర్షియల్ హిట్ అయితే పడలేదు. మధ్యలో ఓటీటీలోకి వెళ్లి రెండు సినిమాలు చేయడం కూడా కొంత వరకు మైనస్ అయ్యిందనే అంటున్నారు.
ఇక శ్యామ్సింగరాయ, అంటే సుందరానికి రెండు సినిమాలు మంచి కథలే. పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే అవి నాని రేంజ్‌ను, మార్కెట్‌ను పెంచేందుకు ఉపయోగపడలేదు. నాని ఎంచుకునే కథలు ఓ మోస్తరు లైన్ దగ్గరే ఆగిపోతున్నాయి. అవి కమర్షియల్‌గా సక్సెస్ కాకపోవడంతో నాని మార్కెట్ పెరగడం లేదు. జెర్సీకి మంచి టాక్ వచ్చినా లాభాలు రాలేదు. నాని యావరేజ్ రేంజ్ ఉన్న కథలే ఎంచుకోవడం.. వాటి మేకింగ్‌తో పాటు సరైన దమ్ము ఉన్న దర్శకుల చేతిలో పడకపోవడం ఇవన్నీ కూడా అతడి మార్కెట్ వైఫల్యాన్ని చూపిస్తున్నాయి.
దీనికి తోడు నానిని ఇండస్ట్రీలో ఓ వర్గం హీరోల అభిమానులు పనికట్టుకుని మరీ టార్గెట్ చేస్తున్నారన్న టాక్ కూడా ఉంది. ఆ వర్గం హీరోల అభిమానులు, ఆ కాంపౌండ్ జనాలు నాని సినిమా వచ్చిన వెంటనే ప్లాప్ టాక్‌ను కావాలనే స్ప్రెడ్ చేస్తున్నారన్న చర్చ కూడా ఉంది. నాని పైన చెప్పిన మైనస్‌లు కవర్ చేసుకుని.. కాస్త మాస్‌ను మెప్పించేలా కాన్సంట్రేషన్ చేస్తే నానికి తిరుగు ఉండదు.