టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – స్టార్ డైరెక్టర్ వివి. వినాయక్‌ది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఆది – సాంబ – అదుర్స్ మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఎన్టీఆర్ బాగా ఇష్టపడే వ్యక్తుల్లో వినాయక్ కూడా ఒకరు. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ వినాయక్‌కు అదుర్స్ 2 సినిమాతో ఛాన్స్ ఇవ్వాలని కూడా ఉన్నాడు. అయితే ఎన్టీఆర్‌ను కెరీర్ స్టార్టింగ్‌లో ఆది సినిమా తిరుగులేని స్టార్‌ను చేసింది. ఇది వినాయక్‌కు తొలి సినిమా. ఎన్టీఆర్‌కు నాలుగోది. ఈ సినిమా ఛాన్స్ ఎన్టీఆర్‌కు అంత సులువుగా రాలేదు. వినాయక్ ముందుగా ఎన్టీఆర్‌కు ఓ లవ్‌స్టోరీ చెప్పాడట. అది ఎన్టీఆర్‌కు నచ్చింది.
అయితే అప్పుడు ఎన్టీఆర్‌కు సన్నిహితుడిగా ఉన్న కొడాలి నాని వీళ్లు లవ్‌స్టోరీలు అంటారు అవి చేయవద్దు అని ఎన్టీఆర్‌కు చెప్పడంతో ఎన్టీఆర్ వినాయక్‌కు ఏం చెప్పలేకుండా కాస్త తటపటాయిస్తున్నాడట. అయితే వినాయక్ ఇక్కడే మరో ఆవేదన కూడా వెళ్లబుచ్చారు. ఇండస్ట్రీలో రాఘవేంద్రరావు గారి శిష్యులం అని చెపితే ఎంతటి హీరో అయినా వెంటనే కథ వింటాడని.. సాగర్ గారి శిష్యులం అంటే ఎవరికి అయినా అంత త్వరగా ఛాన్స్ ఇవ్వరని.. ఈ వివక్ష ఉందని చెప్పారు.
వాస్తవానికి వినాయక్ ముందు కథ చెపుతానని అన్నా కూడా ఎన్టీఆర్ ఎలా వదిలించుకుందామా ? అన్న ఆలోచనతోనే ఓ సారి కథ విని పంపేద్దామనే ఉన్నాడని వినాయక్ చెప్పాడు. అనుకున్నట్టుగానే కొడాలి నాని లవ్‌స్టోరీ వద్దని చెప్పడంతో వినాయక్ ఆశలు అవిరైపోయాయి. వెంటనే వినాయక్ బాబు ఇంకొక్క కథ చెపుతాను.. నచ్చకపోతే చెప్పేయండి.. ఇబ్బంది లేదని అన్నారట. కేవలం రెండు రోజుల్లోనే ఆది కథ రాసుకుని వినాయక్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లాడట.
కథ ఇంట్రడక్షన్ చెప్పిన వెంటనే వాళ్లకు తనపై ఉన్న మబ్బులు విడిపోయాయని… తర్వాత రెండు గంటల పాటు ఆది నెరేషన్ అంతా విన్నారని.. వెంటనే లేచి కౌగిలించుకుని.. మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పారని వినాయక్ చెప్పారు. అలా ఆది సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు ఎన్టీఆర్‌కు తక్కువ వయస్సులోనే స్టార్ డమ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత అదే వినాయక్ ఎన్టీఆర్‌కు అత్యంత ఆప్తుడు అయిపోయాడు. చివరకు వినాయక్ కథ బాలేదని చెప్పిన అదే కొడాలి నాని తర్వాత ఆయన నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా.. ఇదే వినాయక్ డైరెక్షన్‌లో సాంబ, అదుర్స్ సినిమాలు నిర్మించారు.