టాలీవుడ్ సీనియర్ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ తన కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. కృష్ణ అంటేనే అప్పట్లో ప్రయోగాత్మక, భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్. ఎన్టీఆర్‌తో అప్పట్లో సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఒక్క కృష్ణ మాత్రమే ఢీ అంటే ఢీ అనేవారు. ఒక్క యేడాదిలోనే ఆయన 18 సినిమాల్లో నటించి తిరుగులేని రికార్డు క్రియేట్ చేశారు. తొలి కలర్ సినిమా, తొలి గూఢచారి సినిమా, తొలి కౌబాయ్ సినిమా, తొలి 70 ఎంఎం సినిమాలు తీసింది కృష్ణే.
ఇక కృష్ణ సినిమాల్లో స్టార్‌గా ఎదిగి.. ఆ తర్వాత రామారావుకు పోటీగా రాజకీయాల్లోకి వెళ్లి వచ్చాక 1990 తర్వాత కూడా ఎన్నో హిట్ సినిమాలు చేశారు. ఈ క్రమంలనే ఎస్వీ. కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆయన నటించిన సినిమా నెంబర్‌వన్. ఈ సినిమా కెరర్ చివర్లో కృష్ణకు మంచి లైఫ్ ఇచ్చింది. ఈ సినిమా వచ్చాకే కృష్ణకు మళ్లీ మార్కెట్ పెరగడంతో పాటు కొన్ని హిట్ సినిమాలు పడ్డాయి.
ఎస్వీ. కృష్ణారెడ్డి రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి 1993లో మాయలోడు సినిమా చేస్తున్నారు. ఓ రోజు ఆ షూటింగ్‌కు వచ్చిన కృష్ణకు కృష్ణారెడ్డి నెంబర్ వన్ కథ చెప్పగా కృష్ణకు పిచ్చగా నచ్చేసి వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. ఆ మరుసటి యేడాదే 1994లో కృష్ణారెడ్డి దర్శకత్వంలో నెంబర్ వన్ మూవీ తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ఆ రోజుల్లోనే రు. 6 కోట్ల షేర్ రాబట్టింది.
అయితే ఈ సినిమా టైటిల్ ఇటు కృష్ణ ఫ్యాన్స్‌కు అటు మెగాస్టార్ ఫ్యాన్స్‌కు మధ్య కాంట్రవర్సీకి కారణమైంది. ఈ సినిమాకు నెంబర్ వన్ అన్న టైటిల్ పెట్టారు. అయితే ఇండస్ట్రీలో అప్పుడు చిరంజీవి వరుస హిట్లతో పాటు టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటూ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని.. కృష్ణ నెంబర్ వన్ ఎలా ? అవుతారంటూ వారు కామెంట్లు రైజ్ చేశారు. అయితే ఆ కాంట్రవర్సీకి కృష్ణారెడ్డి సింపుల్‌గా చెక్ పెట్టేశారు.
తాము హీరోలు నెంబర్ వనా ? కాదా ? అన్న కోణంలో ఈ సినిమా టైటిల్ పెట్టలేదని.. తండ్రి తర్వాత కుటుంబంలో బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరూ నెంబర్ వనే అన్న కోణంలో పెట్టామని కౌంటర్ ఇచ్చారు. దీంతో ఆ విమర్శలు సర్దుమణిగాయి. ఏదేమైనా కృష్ణ కెరీర్‌కు సెకండ్ ఇన్సింగ్‌లో ఈ సినిమా మాంచి ఊపు అయితే ఇచ్చింది.