టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ – రామ్‌చరణ్ కాంబినేషన్‌ను ఎవ్వరూ ఊహించనే లేదు. టాలీవుడ్‌లో రెండు వర్గాలకు చెందిన స్టార్ హీరోలను ఒకే తెరమీద చూపించిన ఘనత రాజమౌళీకే దక్కింది. అందులోనూ ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో హిట్ అయ్యింది. ఇక సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాలు చేసే విషయంలో ఎప్పుడూ ముందే ఉంటాడు.
ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం ఆచార్యతో తన తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా తండ్రి, కొడుకులు కలిసి నటించడం మంచి విషయం. ఇక ఇప్పుడు చిరు మరో అడుగు ముందుకు వేసి మాస్ మహరాజ్ రవితేజతో మరో మల్టీస్టారర్ చేస్తున్నాడు. బాబి దర్శకత్వంలో చిరు నటిస్తోన్న వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కూడా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇదే కోవలో మెగాస్టార్ చిరంజీవి – సూపర్‌స్టార్ మహేష్‌బాబు కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ? ఉంటుంది. అసలు మామూలు రచ్చ కాదు. ఇటు మెగాస్టార్, అటు సూపర్‌స్టార్ ఇద్దరిని వెండితెర మీద చూసేందుకు రెండు కళ్లు చాలవు. అయితే ఈ కాంబినేషన్ సెట్ చేసేందుకు ఓ దర్శకుడు ట్రై చేశాడు. దాదాపు 15 సంవత్సరాల క్రితమే ఆయన ఈ కథను అనుకున్నాడు. దురదృష్టవశాత్తు అది పట్టాలు ఎక్కలేదు.
ఆ డైరెక్టర్ ఎవరో కాదు కృష్ణవంశీ. వందేమాతరం అన్న టైటిల్‌తో చిరు, మహేష్ కాంబినేషన్లో ఈ సినిమా చేయాలని కృష్ణవంశీ అనుకుని కథ రెడీ చేశాడు. ఈ సినిమా ఇప్పటకీ పట్టాలు ఎక్కలేదు. అయితే ఈ కథతో ఆయన ఇప్పటకీ ట్రావెల్ అవుతూనే ఉన్నాడట. ఇప్పుడున్న పరిస్థితుల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో చిరు, మహేష్ మల్టీస్టారర్ అంటే సాధ్యం కాకపోవచ్చు. అయితే కృష్ణవంశీ ఈ సినిమా అనుకున్న టైంలో చిరు బిజీగా ఉండడం.. ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదు.
తాజాగా రంగమార్తాండ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోన్న కృష్ణవంశీ తాజాగా వందేమాతరం సినిమా గురించి మళ్లీ చెప్పారు. తీస్తే తాను ఈ సినిమా మహేష్, చిరంజీవితో మాత్రమే తీస్తానని.. వారి ప్లేసుల్లో మరో హీరోలను తాను ఊహించుకోనని చెప్పారు. 800 ఏళ్ల పాటు మనవాళ్లు స్వాతంత్య్రం కోసం పోరాటం చేసే క్రమంలో ఎంతో బానిస బతుకు బతికారని.. ఆ బానిస బతుకులు, చేసిన పోరాటాలను ఈ తరం జనరేషన్‌కు చూపించే క్రమంలోనే వందేమాతరం కథ ఉంటుందని కూడా ఆయన చెప్పారు.