బాహుబలి తర్వాత ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తున్నాడన్న వార్తలు తెలిసిందే. అయితే అటు రాజమౌళి కాని ఇటు ఎన్.టి.ఆర్ కాని ఈ సినిమా గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. కాని ఇద్దరు కలిసి ఓ మూవీకి పనిచేయబోతున్నారట. అదేంటి అంటే రాజమౌళి ఎన్.టి.ఆర్ కలిసి ఓ షార్ట్ మూవీకి పనిచేస్తున్నారట.
పెరుగుతున్న సైబర్ నేరాలను కట్టడి చేస్తూ ప్రజలకు అవగాహన కలిగించేలా నగర క్రైం బ్రాంచ్ ఏర్పాటు చేశారట. దీనిపై ప్రజలను చైతన్య పరచేలా ఓ షార్ట్ మూవీ తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. దీనికోసం రాజమౌళి, ఎన్.టి.ఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారని టాక్. ఎన్.టి.ఆర్ ఇప్పటికే ఆ పని పూర్తి చేయగా రాజమౌళి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి ఉందట.
మొత్తానికి ఇద్దరు కలిసి ఓ మంచి పనికోసం తమ సహకారం అందిస్తున్నారు. చెప్పే విషయం ఎలాంటిదైనా సరే సెలబ్రిటీస్ ద్వారా చెప్పిస్తే అది చాలామందికి చేరుతుందని ఈ ఆలోచన చేస్తున్నారు. ఇక ఈ షార్ట్ మూవీని బస్టాండ్, రైల్వే స్టేషన్స్ లో టివిలలో ప్లే చేస్తారని తెలుస్తుంది.