టాలీవుడ్ సీనియర్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున నాలుగు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. వీరిద్దరు తమ సినిమాలతో ఎంత పోటీపడినా బయట మంచి బెస్ట్ ఫ్రెండ్స్. వీరు ఫ్రెండ్స్గాను, అటు కుటుంబ సభ్యులగాను కూడా క్లోజ్‌గానే ఉంటారు. అయితే గతంలో ఈ ఇద్దరు హీరోలు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డాయి. అయితే ఇప్పుడు చాలా యేళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసరి రిలీజ్ అవుతుండడంతో బాక్సాఫీస్ వార్ మామూలుగా ఉండేలా లేదు.
మెగాస్టార్ నటిస్తోన్న లూసీఫర్ రీమేక్ గాడ్పాథర్ సినిమా దసరాకు రిలీజ్ అవుతోంది. మోహనరాజా దర్శకత్వంలో వస్తోన్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నయనతార హీరోయిన్. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక అదే దసరాకు నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వస్తోన్న ది ఘోస్ట్ కూడా వస్తోంది.
సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్తలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కూడా దసరా కానుకగా 2022 అక్టోబర్ 5న సినిమాని రిలీజ్ చేస్తున్నారు. నాగార్జున నటించిన క్లాసిక్ మూవీ శివ కూడా 1989లో ఇదే రోజు రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఘోస్ట్ కూడా సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ అదే రోజు రిలీజ్ చేస్తున్నారు. గతంలో చాలాసార్లు ఈ ఇద్దరు హీరోలు నటించిన సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి.
నాగ్ డెబ్యూ మూవీ విక్రమ్ – చిరు వేట ఐదు రోజుల గ్యాప్‌లో రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత ఆ తర్వాత చంటబ్బాయ్ – కెప్టెన్ నాగార్జున , దొంగ మొగుడు – మజ్ను , సంకీర్తన – ఆరాధన , రుద్రవీణ – ఆఖరి పోరాటం, మురళీకృష్ణుడు – ‘ఖైదీ నెం. 786 , అత్తకు యముడు అమ్మాయికి మొగుడు – విజయ్ , కొండవీటి దొంగ – ప్రేమయుద్దం , ముగ్గురు మోసగాళ్ళు – గోవిందా గోవిందా , స్టాలిన్ – బాస్ సినిమాలతో వీరు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు.
2006 తర్వాత 16 ఏళ్లకు ఇప్పుడు మళ్లీ వీరు తమ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నారు. ఇద్దరూ కీలకమైన దసరాకు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో ఈ పోరు సినీ అభిమానులకు మంచి ట్రీట్ ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి.