యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను ఎంతో అభిమానించే అభిమానులు కోట్లలోనే ఉన్నారు. ఒకప్పుడు వరుస ప్లాపులతో ఎన్టీఆర్ అభిమానులు యాక్టివ్ మోడ్‌లో ఉండేవారే కాదు. అయితే ఇప్పుడు వరుస హిట్లతో కెరీర్‌లోనే ఎన్టీఆర్ పీక్ స్టేజ్‌లో ఉన్నాడు. ఎన్టీఆర్ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేయాల్సిందే. ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే ముందు రోజు అర్ధరాత్రి నుంచే హంగామా మామూలుగా ఉండదు. అందుకే ఎన్టీఆర్ సినిమాలకు ఫస్ట్ డే అదిరిపోయే రేంజ్‌లో వసూళ్లు వస్తుంటాయి.
ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్‌లో స్టూడెంట్ నెంబర్ 1 లాంటిక్లాస్ సినిమాతో క్లాస్ ఆడియెన్స్‌తో పాటు ఆది, సింహాద్రి లాంటి భయంకరమైన బ్లాక్‌బ్టర్ హిట్లతో మాస్‌కు కూడా చేరువ అయ్యాడు. ఎన్టీఆర్‌కు కెరీర్ స్టార్టింగ్‌లో ఎదిగేందుకు చాలా మంది సాయం చేశారు. అప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా అనుకున్నంత సపోర్ట్ లేదు. ఏదో వచ్చాడు.. సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడే కాని.. స్టార్ అవుతాడని ఎవ్వరూ ఊహించనే లేదు.
ఎప్పుడు అయితే ఆది, సింహాద్రి… అంతకుముందే స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలు పడ్డాయో అసలు అప్పటి నుంచి ఎన్టీఆర్ జోరుకు బ్రేకులు వేయడం ఎవ్వరి తరం కాలేదు. అయితే ఎన్టీఆర్‌కు కెరీర్ స్టార్టింగ్ నుంచి ముగ్గురు సొంత సోదరుల్లా సాయం చేశారన్నది వాస్తవం. ఈ విషయం ఎన్టీఆర్ కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు. ఆ ముగ్గురు ఎవరో కాదు డైరెక్టర్ వివి. వినాయక్.. ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా గెలిచిన కొడాలి నాని, వల్లభనేని వంశీ.
వినాయక్ ఎన్టీఆర్‌ను తిరుగులేని విధంగా మాస్‌కు దగ్గరకు చేశాడు. ఆది సినిమాతో ఎన్టీఆర్ ఇమేజ్ ఎంత భయంకరంగా పెరిగిందో తెలిసిందే. ఆదితో పాటు సాంబ, అదుర్స్ సినిమాలు తెరకెక్కించాడు. ఈ మూడు హిట్ సినిమాలే. ఇక కొడాలి నాని ఎమ్మెల్యే అయ్యేందుకు ఎన్టీఆర్ ఎంతో సాయం చేశాడు. కొడాలి నాని ఎమ్మెల్యే అయిన వెంటనే ఎన్టీఆర్‌తో 2004లో సాంబ సినిమా నిర్మించాడు. ఈ సినిమాకు వినాయకే డైరెక్టర్.
ఇక 2010లో కొడాలి నాని, వంశీ ఇద్దరూ కలిసి ఇదే వినాయక్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ ద్విపాత్రిభినయంలో అదుర్స్ సినిమా చేశారు. ఇక వినాయక్ ఆది కథ చెప్పినప్పుడు కూడా ముందుగా వింది కొడాలి నానియే. ఆ చిన్న వయస్సులోనే ఎన్టీఆర్ ఇంత బరువైన కథ మోస్తాడా ? అన్న సందేహం కూడా కొడాలి నానికి కలిగింది. అయితే వినాయక్ నమ్మకంతో ఒప్పించి మరీ ఈ సినిమా చేశాడు. కాలక్రమంలో ఈ ముగ్గురితో ఎన్టీఆర్ రిలేషన్ వేర్వేరుగా మారినా ఇప్పటకీ స్నేహంగానే ఉంటుంటారు.