టాలీవుడ్ యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లోనే క్రేజీ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్‌లో ఆదిపురుష్ – సలార్ – ప్రాజెక్ట్ కే – మారుతి సినిమా – సందీప్ వంగ స్పిరిట్ సినిమాలు ఉన్నాయి. వీటిల్లో మారుతి సినిమా వదిలేస్తే మిగిలిన అన్ని సినిమాలు పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. రాధేశ్యామ్ సినిమాకు ముందు వరకు ప్రభాస్‌కు ఒక్కో సినిమాకు రు. 100 కోట్ల రెమ్యునరేషన్ ముట్టింది.
ఈ సినిమా సరిగా ఆడలేదు. అయితే ప్రభాస్ రెమ్యునరేషన్ మరింత పెరిగింది. ఇప్పుడు ప్రభాస్ ఒక్కో సినిమాకు ఏకంగా రు. 120 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. వాస్తవానికి బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్ రెండు సినిమాలు అంచనాలు అందుకోలేదు. సాహో తెలుగులో ప్లాప్ అయినా కూడా నార్త్‌లో .. అది కూడా బాలీవుడ్‌లో ఏకంగా రు. 150 కోట్లు రాబట్టింది.
దీంతో ప్రభాస్ సినిమా హిట్ అయితే ఈజీగా రు. 1000 కోట్ల గ్రాస్ వసూల్లు వస్తాయని నిర్మాతలు ధీమాగా ఉన్నారు. అందుకే ఇప్పుడు ప్రభాస్‌కు రు. 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు వెనక్కు తగ్గడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదారు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి రెమ్యునరేషన్‌గా ప్రభాస్‌కు ఏకంగా రు. 600 కోట్లు వస్తున్నాయి. ఇంత అమౌంట్ చేతికి వచ్చేయడంతో ప్రభాస్ ఏం చేస్తున్నాడన్న చర్చ సహజంగానే వస్తుంది.
ప్రభాస్ ఇప్పటికే తన ఫ్రెండ్స్ ప్రమోద్, వంశీతో కలిసి థియేటర్ల వ్యాపారంలోకి దిగాడు. ఏపీలో పలు థియేటర్లను లీజుకు తీసుకుని రీ మోడలింగ్ చేశారు. ఇక సూళ్లూరుపేటలో వీ ఎపిక్ పేరుతో అతిపెద్ద థియేటర్‌ను కూడా నిర్మించాడు. ఇప్పుడు ఈ రు. 600 కోట్లతో హోటల్ చైన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నాడట.
అయితే ప్రభాస్ తన హోటల్ బిజినెస్‌ను ఇండియాలో కాకుండా దుబాయ్, స్పెయిన్, యూరప్ దేశాల్లో విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ గ్రాండ్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.