టాలీవుడ్‌లో అక్కినేని హీరో నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సినిమాల విషయంలో సమంత బాగా స్పీడ్ అయిపోయింది. ఈ క్రమంలోనే సమంత చేస్తోన్న సినిమాలపై చాలా రూమర్లే ఉన్నాయి. ఓ వైపు బాలీవుడ్‌లో హాట్ వెబ్‌సీరిస్‌లు చేస్తూనే ఇటు తెలుగు, తమిళం, అటు హిందీ సినిమాలు కూడా చేస్తోంది. తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తోన్న సామ్.. యశోద అనే థ్రిల్లర్ సినిమా కూడా చేస్తోంది. అటు విజయ్ దేవరకొండకు జోడీగా ఖుషీ సినిమా చేస్తోంది.
ఇక పుష్ప సినిమాలో ఆమె చేసిన ఐటెం సాంగ్‌లో హాట్‌నెస్ చూసి జనాలకు పిచ్చెక్కిపోయింది. సెకండ్ ఇన్సింగ్స్‌లో సమంతకు ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ వచ్చేసింది. ఆమె మరోసారి ఎన్టీఆర్‌తో కలిసి హీరోయిన్‌గా నటించేందుకు రంగం సిద్ధం అవుతోంది. త్రిబుల్ ఆర్‌తో పాన్ ఇండియా హిట్‌తో పాటు డబుల్ హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ కొరటాల శివతో తన నెక్ట్స్ సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమాలో సమంతను ఎన్టీఆర్‌కు జోడీగా ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ – సమంత కాంబినేషన్లో బృందావనం – రామయ్యా వస్తావయ్యా – రభస – జనతా గ్యారేజ్ లాంటి సినిమాల్లో నటించారు. పై నాలుగు సినిమాల్లో కొరటాల దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజే అన్నింటికన్నా పెద్ద హిట్ అయ్యింది. దీంతో ఇప్పుడు మరోసారి కొరటాల డైరెక్షన్లో వస్తోన్న సినిమాలోనూ సమంతనే రిపీట్ చేయాలని కొరటాల భావిస్తున్నాడు.
అయితే ముందుగా ఈ సినిమాకు హీరోయిన్‌గా అలియాభట్‌ను అనుకున్నారు. అయితే ఆమె గర్భం దాల్చడంతో డేట్లు ఇవ్వడం కుదర్లేదు. ఆ తర్వాత మరో బాలీవుడ్ భామ కియారా అద్వానీని అనుకున్నారు. అయితే ఇప్పటికే తెలుగులో చరణ్ – శంకర్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో డేట్లు ఇవ్వడం కుదర్లేదట.
ఈ క్రమంలోనే ఇప్పుడు సమంతనే తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. స్టోరీ ఫైనల్ అయ్యేలోపు సమంత పేరు ఎనౌన్స్ చేయడంతో పాటు ఇతర కాస్టింగ్ వివరాలు కూడా వెల్లడిస్తారని తెలుస్తోంది. మరోసారి సమంత ఎన్టీఆర్ జోడీ కడితే అది వీరి కాంబోలో ఐదో సినిమా అవుతుంది.