సినీ రంగంలో రారాజుగా భాసిల్లిన అన్నగారు ఎన్టీఆర్ అంచెలంచెలుగా ఎదుగుతూ.. అగ్రస్థానానికి చేరు కున్నారు. అయితే.. ఆయన ఇంత అగ్రస్థానానికి చేరుకోవడం వెనుక ఎలాంటి సిఫార్సులు లేవు. కేవలం ఆయన పడ్డ కష్టమే తప్ప.. మరొకటి లేదనేది వాస్తవం. ఆకష్టంలోనూ ఆయన ప్రత్యేకతను చాటుకునేవా రు. ఎక్కడా రాజీ పడే ధోరణి అన్నగారిలో లేకపోవడం.. గమనించాల్సిన విషయం. ఎవరు ఏమన్నా.. ఏదో అనుకున్నా.. ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గేవారు కాదు.
మరీ ముఖ్యంగా వాచకం.. అభినయం విషయంలో దర్శకులు రాజీపడిన సందర్భాలు ఉన్నాయి కానీ.. అన్నగారు రాజీ పడిన సందర్భాలు మాత్రం మనకు ఎక్కడా కనిపించవు. ప్రతి విషయంలోనూ చాలా నిశితంగా ఆయన ఆలోచించేవారు. ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోయేవారు. ఇక, మేకప్ విషయానికి వస్తే.. సినిమాకు ఇదే ప్రధానం అంటూ.. ఆయన పదేపదే చెప్పేవారు. అఫ్ కోర్స్.. అప్పట్లో మేకప్ విషయంలో నిర్మాతలు.. దర్శకులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు.
ఇప్పటి మాదిరిగా.. అప్పట్లో ఇంతమంది మేకప్ ఆర్టిస్టులు ఉండేవారు కాదు. దీంతో నటీనటులే తమ తమ మేకప్ చేసుకునేవారు. అన్నగారు కూడా అంతే.. చాలా తక్కువ కాలంలోనే తన మేకప్ తనే చేసుకు నే స్థాయికి ఎదిగారు. లవకుశ సినిమాలో అన్నగారు రాముడి పాత్ర పోషించారు. ఈ సినిమాను మూడు సంవత్సరాలు తీశారు. దీనికి మధ్యలో దర్శకుడు మృతి చెందడం.. ఒక కారణమనే విషయం తెలిసిందే. ఇక, ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్నగారు. మేకప్ తానే వేసుకునేవారు.
అయితే, కొన్ని సందర్భాల్లో రాముడు విషణ్ణ వదనంతో కనిపించాల్సి ఉంటుంది. అలాంటి సీన్లు ఉన్న ప్పుడు అన్నగారు ప్రత్యక శ్రద్ధ తీసుకునేవారు. ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఆయన మేకప్ వేసుకు నేవారు. ఇలా ఓ సీన్ కోసం.. అన్నగారు మేకప్ వేసుకోవడంలో నిమగ్నమైపోయారు. అయితే.. అప్పటికే షెడ్యూల్ టైం అయిపోవడంతో ఆ రోజు షూటింగ్‌ను ఆపేశారు. దీనిపై అన్నగారు విస్మయం వ్యక్తం చేశారు. ఇక, అప్పటి నుంచి అందరికన్నా ముందు వచ్చి.. మేకప్ పనిప్రారంభించేవారట. ఇదీ.. సంగతి.