Moviesసాయి పల్లవి ని కావాలనే తొక్కేస్తున్నారా...ఆ మాటలకు అర్ధం ఏంటి..?

సాయి పల్లవి ని కావాలనే తొక్కేస్తున్నారా…ఆ మాటలకు అర్ధం ఏంటి..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ రేంజ్ లో లో పాపులర్ అయిన హైబ్రీడ్ పిల్ల ఈ సాయి పల్లవి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే అమ్మడు క్యారెక్టర్ అంటే జనాలకు చాలా ఇష్టం. ఎక్కడ పాజిటివిటీ ఉంటాదో అక్కడే నెగిటివిటీ కూడా ఉంటాది. అలాగే..సాయిపల్లవి ని పొగిడేవారు ఎంత మంది ఉన్నారో తిట్టేవారు అంతేమంది ఉన్నారు. ఇది అమ్మడు క్రేజ్ చూసిన ఓర్వలేక కొందరు హీరోయిన్లు కావాలనే చేయిస్తున్నారన్నది సాయి పల్లవి అభిమానుల వాదన.

రీసెంట్ గా సాయి పల్లవి లీడ్ రోల్ లో నటించిన సినిమా విరాటపర్వం. సినిమాలో అమ్మడు నటన బాగున్నా.. కొందరు కావాలనే సినిమా పై నెగిటీవ్ కామెంట్స్ స్ప్రెడ్ చేశారు. దానికి కారణం లేకపోనూలేదు. సినిమా ప్రమోషన్స్ టైంలో అమ్మడు “కశ్మీర్ ఫైల్స్’ సినిమా గురించి మాట్లాడుతూ .. గో ర‌క్ష‌కుల గురించి లింక్ పెడుతూ కామెంట్స్ చేసింది. అంతే..ఒక్కసారిగా జనాలు ఆమె పై ఫైర్ అయ్యారు. బుద్ది ఉందా..అంటూ తిట్టిపోశారు. ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ భ‌జ‌రంగ్ ద‌ళ్ ప్ర‌తినిధులు ఏకంగా హైద‌రాబాద్ సుల్తాన్ బ‌జార్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు కూడా చేశారు.

ఈ మధ్యనే హైరింగ్ వచ్చిన కేస్..సాయి పల్లవి పిటీషన్ ని కొట్టివేసింది. దీంతో సాయి పల్లవి కి భారీ ఎదురుదెబ్బ తగ్గిలిన్నట్లైంది. అసలు ఇంత రాద్ధాంతం చేయడానికి అక్కడ సాయి పల్లవి ఏం మాట్లాడిందా అని క్షుణంగా పరిశీలిస్తే ఆమె ఉద్దేశ‌పూర్వ‌కంగా, ఎవ‌రినో కించ‌ప‌ర‌చాల‌ని మాట్లాడిన‌ట్లు అనిపించ‌లేదంటున్నారు సినీ విశ్లేషకులు. సాయిపల్లవి డాక్టర్..ఆమె ఏ ప్రాణికి హానీ జరిగిన చూడలేదు. ప్రాణం పోయడమే ఆమె నేర్చుకుంది.

అలాంటి జోనర్ లో నే ఆమె పెరిగింది. ఇదే విషయాని కొంచెం క్లీయర్ గా జనరల్ వాదుకలో చెప్పుకొచ్చింది. అన్నింటికంటే మాన‌వ‌త్వం గొప్ప‌ద‌ని ఆమె మాట్లాడింది. అంతేగా.. అప్పుడు కాశ్మీరి పండిట్ల విషయంలో అన్యాయం జరిగిన్నట్లే ఇప్పుడు గో రక్షకుల విషయంలో జరుగుతుంది. అది కూడా అన్యాయమే కదా..అన్నట్లు మాట్లాడింది. దానిలో తప్పేముంది అంటూ సినీ విశ్లేషకులు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. చిన్న విషయానికి సాయిపల్లవి ని ఇలా బజారుకి ఎక్కించడం ఏంటి ..దీని వెనుక ఓ రాజకీయ కుట్ర ఉందనేది వాళ్ల అభిప్రాయం . ఏది ఏమైన సాయిపల్లవి ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారు కొందరు జనాలు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news