తెలుగులో మాత్రమే కాదు, ఇతర భాషలలోనూ ఏ హీరోయిన్ ఎప్పుడు స్టార్ స్టేట్స్ అందుకుంటుందో ఏ హిరోయిన్ ఎప్పుడు కనుమరుగవుతుందో చెప్పడం చాలా కష్టం. అయితే, ఎక్కువశాతం మాత్రం సక్సెస్‌ల మీదే హీరోయిన్ల కెరీర్ ఆధారపడి ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో వరుసగా ఫ్లాప్స్ అందుకున్నవారు కూడా ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తే శృతి హాసన్, పూజా హెగ్డెల మాదిరిగా స్టార్స్ అయిపోవచ్చు. లేదంటే హెబ్బా పటేల్ మాదిరిగా అడ్రస్ లేకుండాను పోవచ్చు.
అలా ఎలా మొదటి సినిమా. అయితే, కుమారి 21 ఎఫ్ సినిమా యువతకే కాదు, అన్నీ వర్గాల ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయే సినిమా. మ్యూజికల్‌గా కూడా సూపర్ హిట్ అయింది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమాతో గెబ్బా పటేల్ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్లా క్రేజ్ తెచ్చుకుంది. అసలు ఈ సినిమాలో హెబ్బా రచ్చ చూసిన తెలుగు యువత ఆమెను ఓ రేంజ్లో ఆరాధించారు. ఆమె ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ అయ్యి కొన్నేళ్లు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తుందనే అనుకున్నారు.
ఈ సినిమా తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్, ఏంజిల్, ఈడో రకం ఆడో రకం లాంటి సినిమాలు చేసింది. అయితే, హెబ్బా కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమా ఒక్క కుమారి 21 ఎఫ్ మాత్రమే. మిగతా సినిమాలన్ని ఫ్లాప్‌గానే మిగిలాయి. చెపాలంటే హెబ్బా పటేల్ ఫాంలో ఉన్నప్పుడు బోల్డ్ సీన్స్ తను చేసినట్టుగా ఇంకో హీరోయిన్ చేయలేదనే చెప్పాలి. అందాల ఆరబోతలోనూ హీరోలతో లిప్ కిస్సులిస్తూ రొమాన్స్ చేయడంలోనూ హెబ్బా అదరగొట్టింది. కొన్ని ఘాటు సన్నివేశాలు చూసిన వారికి రాత్రిళ్ళు నిద్రపట్టని రోజులూ ఉన్నాయి.
కృష్ణం శెట్టి అయోధ్య కుమార్ దర్శకత్వంలో వచ్చిన 24 కిసెస్ అనే సినిమా అయితే, యూత్ ఎప్పటికీ మర్చిపోరు. సినిమా అట్టర్ ఫ్లాపయినా కూడా ఈ సినిమాలో హెబ్బా పటేల్ హీరోకు పెట్టిన ముద్దులను మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పటికీ ఈ సినిమాలోని కిస్సింగ్ సీన్స్ యూట్యూబ్‌లో కురాళ్ళంతా ఓ రౌండ్ వేస్తూనే ఉన్నారు. అయితే, ఈ సినిమా తన కెరీర్ గ్రాఫ్‌ను పూర్తిగా దెబ్బతీసింది. 24 కిసెస్ తర్వాత మళ్ళీ హీరోయిన్గా హెబ్బాకి మంచి అవకాశమే దక్కలేదు.
ఐటెం భాగమగా మారి స్పెషల్ మసాలా సాంగ్‌లో నటించినప్పటికీ అవీ హెబ్బాను ఫాంలోకి తీసుకు రాలేకపోయాయి. ఇలా తన కెరీర్ మొత్తం డౌన్ ఫాల్ అవడానికి కారణం తొందరపడి తనకు సూటవని కథలను ఎంచుకోవడమే. కథల ఎంపికలో అసలు లాజిక్ పట్టించుకోలేదు. ఇప్పుడున్న కృతి శెట్టి మాదిరిగా మంచి కథలను..స్టార్ హీరోల సినిమాలను ఎంచుకుంటే ఖచ్చితంగా పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యేది. కానీ, పూర్తిగా కథల ఎంపికలో రాంగ్ స్టెప్స్ వేయడంతోనే హీరోలతో ఎంత రొమాటిక్గా నటించినా కెరీర్‌కు ఉపయోగం లేకుండా పోయింది.