టాలీవుడ్లో గత ఆరేడు నెలలుగా ఒక్కటే గాసిప్ బాగా వైరల్ అవుతోంది. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ .. హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని. వీరిద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారన్నదే ఆ గాసిప్. మామూలుగా లావణ్య తన ఏజ్, తన టైంలో వచ్చిన హీరోయిన్లు అందరూ ఫేడవుట్ అయిపోయినా ఆమె మాత్రం తాను ఇంకా ఇండస్ట్రీలో ఉన్నాను అనిపించుకుంటోంది.
ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు దాటుతున్నా ఆమె ఇంకా టాప్ హీరోయిన్ల లిగ్లోకి అయితే చేరలేదు. తాజాగా ఆమె హ్యాపీ బర్త్ డే సినిమాతో సోలోగా సత్తా చాటేందుకు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక కొద్ది రోజుల క్రితమే ఆమె బర్త్ డే జరిగినప్పుడు వరుణ్ తేజ్ ఆమెకు సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ రింగ్ కూడా తొడిగేశాడని.. వాళ్లిద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ఒక్కటే ప్రచారం జరిగింది.
తర్వాత ఈ వార్తలు సైలెంట్ అయ్యాయి. అయితే వీటిని ఓపెన్‌గా, బలంగా ఖండించేందుకు అటు వరుణ్, ఇటు లావణ్య ఇద్దరు ఇష్టపడుతున్నట్టుగా లేదు. వీళ్లిద్దరు కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాలు చేశారు. ఆ టైం నుంచే చాలా అంటే చాలా సన్నిహితులుగా ఉంటున్నారన్న ప్రచారం అయితే జరుగుతోంది. ఇక అంతకుముందు నుంచే మరో మెగా హీరో సాయితేజ్ – రెజీనా కసాండ్రా మధ్య ప్రేమాయణం కూడా ఎంత హైలెట్ అయ్యిందో చూశాం.
రెజీనా సాయితేజ్ కలిసి పిల్లానువ్వేలేని జీవితం సినిమాలో ముందుగా నటించారు. ఇది సాయితేజ్‌కు ఫస్ట్ రిలీజ్ సినిమా. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా చేశారు. ఇది కూడా సూపర్ హిట్ అయ్యింది. దీంతో వీరిద్దరి గురించి గుసగుసలు మొదలయ్యాయి. ఆ తర్వాత మరోసారి ఈ జోడీ నక్షత్రం సినిమాలో కూడా కలిసి నటించింది.
చాలా రోజుల పాటు వీరు ప్రేమలోనూ.. డేటింగ్లోనూ ఉన్నారని ఇండస్ట్రీలో ఒక్కటే గుసగుసలు వినిపించాయి. తర్వాత అవి సైలెంట్ అయినా ఇప్పుడు వరుణ్ తేజ్ – లావణ్య ప్రేమ, పెళ్లి వార్తలు హైలెట్ అవుతున్నాయి. మొత్తంగా చూస్తే ఏదో ఒక మెగా హీరో, హీరోయిన్ ప్రేమ వార్తలతో మీడియా, సోషల్ మీడియాలో కావాల్సినంత రచ్చ క్రియేట్ అవుతూనే వస్తోంది.