తెలుగు సినిమా రంగంలో నాటి తరంలో ఎంతో మంది క్రేజీ హీరోయిన్లు ఉండేవాళ్లు. ఈ లిస్టులోనే సీనియర్ నటి రాధిక కూడా ఒకరు. 1970 – 1990 దశకాల మధ్యలో రాధ సౌత్ సినిమాను ఓ ఊపు ఊపింది. ఆమె తమిళ్ అమ్మాయి అయినా ( తెలుగు మూలాలు ఉన్న) ఎక్కువుగా తెలుగులోనే సినిమాలు చేసింది. తెలుగులో ఆమె అందరు స్టార్ హీరోల పక్కన నటించి హిట్లు కొట్టింది. తెలుగులో చిరంజీవి – రాధిక కాంబినేషన్ అంటే పిచ్చ క్రేజ్. చిరుతో పోటీపడి మరీ రాధిక డ్యాన్సులు వేసేది.
డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ ఇలా ఏదైనా రాధికతో పోటీపడి నటించాలంటే ఎంత పెద్ద హీరోలకు అయినా కష్టమయ్యేది. చిరంజీవే స్వయంగా ఈ విషయాన్ని ఎన్నోసార్లు ఒప్పుకున్నారు. చిరంజీవి – రాధిక కాంబినేషన్ అంటే అప్పట్లో పెద్ద హిట్ ఫెయిర్. వీరి కాంబోలో అభిలాష – న్యాయం కావాలి – దొంగ మొగుడు – పట్నం వచ్చిన ప్రతివ్రతలు – శివుడు శివుడు శివుడు – గూఢచారి నెంబర్ 1 – యమకింకరుడు – జ్వాల – పులి బెబ్బులి – పల్లెటూరి మొనగాడు – ఆరాధన – బిల్లా రంగా – మొండిఘటం – కిరాయిరౌడీలు – రాజా విక్రమార్క – సింహపురి సింహం – ప్రేమ పిచ్చోళ్లు – హీరో – ఇది పెళ్లంటారా – ప్రియ ఇలా ఎన్నో సినిమాలు వచ్చయి.
పై సినిమాల్లో చాలా సినిమాలు సూపర్ హిట్. ఇక రాధిక చెల్లెలు నిరోషా. ఆమె కూడా హీరోయనే. 1990ల్లో ఆమె తన అందచందాలతో కుర్రకారు గుండెలను హీటెక్కించేది. చూడడానికి బొద్దుగా ఉండడం.. గ్లామర్‌కు గేట్లెత్తేయడంతో నిరోషాకు అప్పట్లో స్టార్ హీరోల పక్కన కూడా అవకాశాలు వచ్చాయి. నిరోషాకు కెరీర్ పరంగా రెండో సినిమాయే బాలయ్యతో చేసే ఛాన్స్ వచ్చింది.
కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన నారి నారి నడుమ మురారి సినిమాలో ఆమె బాలయ్యకు జోడీగా నటించింది. ఈ సినిమా తర్వాత ఆమె కమర్షియల్ హీరోయిన్‌గా మారిన ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత ఆమె తెలుగులో చిరంజీవికి జోడీగా స్టూవర్ట్‌పురం పోలీస్‌స్టేషన్ సినిమా చేసినా ఆ సినిమా సక్సెస్ కాలేదు.
ఇక నిరోషా శ్రీలంక రాజధాని కొలంబోలో జన్మించింది. ఆమె వయస్సు 52 సంవత్సరాలు కాగా.. తనతో పాటు సింధూరపువ్వు సినిమాలో నటించిన రాంకీనే ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆమె తమిళ సినిమాల్లో అత్త, అమ్మ పాత్రలతో పాటు సీరియల్స్ కూడా చేస్తోంది. ఇక నిరోషా అక్క రాధిక సీనియర్ నటుడు శరత్‌కుమార్‌ను ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లో ఉంది.