నందమూరి హీరో కళ్యాణ్‌రామ్‌ది చాలా డిఫరెంట్ స్టైల్. బలమైన నందమూరి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా ఎక్కడా ఆ దర్పం అనేదే ఉండదు. ఎవ్వరిని నొప్పించడు.. ఇండస్ట్రీలో ఎన్ని కుళ్లు రాజకీయాలు ఉన్నా ఒకరి విషయంలో ఎప్పుడూ జోక్యం చేసుకోడు.. తన పనేదో తాను చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఇక నిర్మాతగా కూడా తన సినిమాలు తాను చేసుకుంటూ ఉంటాడు. తన తాత ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో ఎన్టీఆర్ ఆర్ట్స్ అన్న బ్యానర్‌పై పెట్టి ఆ బ్యానర్ మీద ప్రతిష్టాత్మకంగా సినిమాలు తీస్తూ తాత పేరు నిలబెట్టేందుకు అహరహం శ్రమిస్తూ ఉంటాడు.
తన సినిమాల ద్వారా నష్టం వచ్చిన డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు తన అమౌంట్‌నే తిరిగి ఇచ్చేస్తాడే తప్పా తన సినిమా వల్ల ఎవ్వరూ నష్టపోకూడదన్న సిద్ధాంతంతో ఉంటాడు. ఈ క్రమంలోనే కాస్త గ్యాప్ తర్వాత కళ్యాణ్‌రామ్ నటిస్తోన్న బింబిసార సినిమా త్వరలోనే రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఆగస్టు 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా కళ్యాణ్‌రామ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్లు సినిమాపై ఆసక్తి రేపుతున్నాయి. ట్రైలర్ కూడా భారీగా ఉందన్న చర్చలు స్టార్ట్ అయ్యాయి. అయితే బర్త్ డే సందర్భంగా కళ్యాణ్‌రామ్ తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. కళ్యాణ్‌రామ్ భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్న కలర్‌ఫుల్ ఫొటోను నందమూరి అభిమానులు బాగా ట్రెండ్ చేశారు.
కళ్యాణ్‌రామ్ ఫ్యామిలీ బయట ఫంక్షన్లలో ఎక్కడా కనపడదు. కళ్యాణ్‌రామ్ భార్య స్వాతి. స్వాతి నందమూరి ఫ్యామిలీ సంప్రదాయాల్లోనే ఉంటుంది. ఆమె స్వతహాగా వైద్య వృత్తిని అభ్యసించారు. అయితే ఆమె తన కుటుంబంతోనే టైం గడిపేస్తూ ఉంటుంది. భర్త, ఇద్దరు పిల్లలే లోకంగా ఇంటికే అంకితమైపోయారు.
స్వాతికి సీనియర్ హీరో, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అంటే ఇష్టం అట. నాగ్ నటించిన మన్మథుడు సినిమా అంటే ఆమెకు ఎంతో ఇష్టం.. లెక్కలేనన్ని సార్లు స్వాతి మన్మథుడు సినిమా చూసిందట. ఆమె కాలేజ్ టైంలో నాగార్జున సినిమా రిలీజ్ ఉందంటే చాలు… కాలేజ్ ఎగ్గొట్టి మరీ ఆ సినిమా చూసేయాల్సిందే అట. ఈ విషయాన్ని కళ్యాణ్‌రామే స్వయంగా చెప్పారు.