Moviesఆ వ్య‌క్తితో శ్రీముఖి పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉందా... ఆ సిగ్న‌ల్స్ మీనింగ్...

ఆ వ్య‌క్తితో శ్రీముఖి పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉందా… ఆ సిగ్న‌ల్స్ మీనింగ్ ఏంటి…!

టాలీవుడ్ టాప్ యాంక‌ర్లలో ఒక‌రు అయిన శ్రీముఖి స్పీడ్ గ‌తంతో పోలిస్తే కొంత త‌గ్గింద‌నే చెప్పాలి. ముఖ్యంగా శ్రీముఖి బిగ్‌బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి ముందు ఎక్క‌డ చూసినా ఆమె హంగామా, హ‌డావిడే క‌నిపించేది. బిగ్‌బాస్ షోలో ర‌న్న‌ర‌ఫ్‌తో స‌రిపెట్టుకున్న ఆమె ఆ త‌ర్వాత ఆమె యాంక‌ర్‌గా కాస్త దూరంగా ఉంటూ వ‌చ్చింది. ఇదే ఆమె కెరీర్‌పై బాగా ఎఫెక్ట్ చూపించింద‌నే చెప్పాలి. గ‌తంతో పోలిస్తే శ్రీముఖికి ఇటు యాంక‌ర్‌గాను, అటు సినిమా అవ‌కాశాలు కూడా త‌గ్గాయి.

ఒక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో శ్రీముఖి అంటే పిచ్చ క్రేజ్. అయితే ఆమె యాంక‌ర్‌గా దూరం జ‌రిగాక యంగ్ యాంక‌ర్లు బుల్లితెర‌పైకి దూసుకు వ‌చ్చేశారు. ప్ర‌స్తుతం శ్రీముఖి స‌రిగ‌మ‌ప అనే సింగింగ్ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ షోకు ప‌ర్వాలేద‌నిపించేలా రేటింగ్ అయితే వ‌స్తోంది. ఈ షో సాక్షిగా శ్రీముఖి ఓ వ్య‌క్తిపై పీక‌ల్లోతు ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రుస్తోంది.

ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు శ్రీ చ‌ర‌ణ్‌. ఈ షో క‌రెక్టుగా చూస్తే గ‌త కొన్ని వారాలుగా శ్రీముఖి కంటిన్యూగా శ్రీ చ‌ర‌ణ్‌పై జోకులు వేస్తూ అత‌డి ఎట్రాక్ష‌న్ అంతా త‌న‌మీద ఉండేలా చేసేందుకు బాగానే తాప‌త్ర‌య ప‌డుతున్న‌ట్టుగా ఉంది. తొలిప్రేమ సినిమాలో హీరోయిన్ కీర్తిరెడ్డి ఎంట్ర‌న్స్ ఎలా ఉంటుందో ? అదే స్టైల్లో ఎంట్రీ ఇచ్చి చ‌ర‌ణ్‌ను త‌న వైపున‌కు తిప్పేసుకునేలా చేసుకుంది.

ఆ త‌ర్వాత చ‌ర‌ణ్ కూడా శ్రీముఖికి ఐ ల‌వ్ చూ చెప్పేంత రేంజ్‌లో ఎక్స్‌ప్రెష‌న్స్ ఇవ్వ‌డంతో అంద‌రూ షాక్ అయ్యారు. అదే టైంలో చ‌ర‌ణ్ షూ లేస్ క‌ట్టుకుని అంద‌రికి షాక్ ఇచ్చారు. షూ లేస్ లూజ్ అయ్యాయి.. క‌ట్టుకుంటున్నా అని చెప్ప‌గా… వెంట‌నే శ్రీముఖి నువ్వు లూజే.. క‌నీసం షూ లేస్ అయినా టైట్‌గా క‌ట్టుకో అన‌డంతో ఆ ద్వందార్థం వెన‌క మీనింగ్ ఉందిలే అని అంద‌రూ గుస‌గుస‌లాడుకుంటున్నారు.

అలాగే శ్రీముఖి నాలో అర‌సెక‌ను పాటు ఆశ రేపావు అని చెప్ప‌గా.. శ్రీముఖి – చ‌ర‌ణ్‌తో క‌లిసి డ్యాన్స్ చేసిన‌ప్పుడు గ‌ట్టిగా హ‌గ్ కూడా ఇచ్చింది. ఇక తాజాగా త‌న మ‌న‌సులో ఉన్న మాట‌ను శ్రీచ‌ర‌ణ్‌కు ఎన్నిసార్లు చెప్పినా అత‌డు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. తాను ఎన్నో సార్లు ఐల‌వ్ యూ చెప్పాన‌ని కూడా శ్రీముఖి చెప్పింది. ఏదేమైనా శ్రీ చ‌ర‌ణ్‌ను శ్రీముఖి పిచ్చపిచ్చ‌గా ప్రేమిస్తున్న‌ట్టు చేస్తోన్న కామెంట్లు, ఆమె తీరు ఇప్పుడు నెట్టింట్లో బాగా వైర‌ల్ అవుతోంది. మ‌రి నిజంగానే ఆమె శ్రీచ‌ర‌ణ్‌ను ప్రేమిస్తుందా ? లేదా ? షోలో స‌ర‌ద‌గా ఆట‌ప‌ట్టిస్తుందా ? అన్న‌ది వాళ్లిద్ద‌రికే తెలియాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news