తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది నటీనటులు బాగానే రాణిస్తూ ఉన్నారు. కొందరు వంశపారపర్యంగా టాలీవుడ్ లోకి ఎంటర్ ఇవ్వగా మరికొంతమంది సొంత టాలెంట్ తో వచ్చి ఇండస్ట్రీలో ఎదిగిన వారు ఉన్నారు. ఇక తమ జీవిత భాగస్వాములను చిన్న వయసులోనే కోల్పోయిన కొంతమంది నటీనటులు ఉన్నారు వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1). సుమలత:
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో వరుస సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. కన్నడ స్టార్ హీరో అంబరీష్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. సుమలత స్వస్థలం ఏపీలోని గుంటూరు జిల్లా రేపల్లె. ఆమె ముందుగా తెలుగులో 1980వ దశకంలో తన అందచందాలతో ఓ ఊపు ఊపేసింది. తర్వాత తమిళంతో పాటు కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కన్నడలో సినిమాలు చేస్తోన్న టైంలో అంబరీష్ సుమలత అందానికి ముగ్ధుడైపోయాడు. ముందు అంబరీష్ సుమలతకు ప్రపోజ్ చేయగా.. తర్వాత ఆమె కూడా ఒప్పుకుంది. అయితే సుమలతకు మరీ అంత ఏజ్ కాకపోయినా 2018లో తన భర్తను పోగొట్టుకుంది.
2). రోహిణి:
పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ చాలా బిజీగా ఉన్న రోహిణి భర్త ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి. ఆయనే రఘువరన్. రఘువరన్ అంటేనే సరికొత్త విలనిజానికి కేరాఫ్. తెలుగుతో పాటు తమిళం, అటు బాలీవుడ్‌లోనూ రఘువరన్ విలనిజాన్ని ఇష్టపడే వారు ఎంతోమంది ఉన్నారు. ఇక అనకాపల్లి అమ్మాయి.. అచ్చ తెలుగు అమ్మాయి రోహిణి చిన్న వయస్సులోనే రఘువరన్‌తో ప్రేమలో పడింది. అయితే తర్వాత రఘువరన్ తాగుడుకు బానిస కావడంతో వీరు విడాకులు తీసుకోకపోయినా దూరంగా ఉన్నారు. చివరకు రఘువరన్ అనారోగ్యంతో 2008లో మరణించారు. రోహిణి చాలా చిన్న వయస్సులోనే భర్తను పోగొట్టుకుంది.
3). సురేఖ వాణి:
పలు చిత్రాలలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ సురేఖవాణి.. సీరియల్ నటుడు తేజను ప్రేమ వివాహం చేసుకుంది. సురేఖవాణి భర్త కూడా అనారోగ్యంతో 2019లోనే మృతిచెందారు. భర్త కోల్పోయినా సురేఖ ఎంతో ఆత్మస్థైర్యంతో జీవిస్తోంది. సురేఖ.. తన కుమార్తెతో కలిసి సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తుందో చూస్తూనే ఉన్నాం.
4). మీనా:
చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పలు సినిమాలలో హీరోయిన్గా నటించింది మీనా. స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో కూడా నటించింది. చాలా లేట్‌గా 40 + ఏజ్‌లో పెళ్లి చేసుకున్న మీనా రీసెంట్గా తన భర్త విద్యాసాగర్‌ను కోల్పోయింది. గత నెల 29వ తేదీన శ్వాస సంబంధిత సమస్యతో ఈమె భర్త విద్యా సాగర్ మరణించారు.
5). బోనీ కపూర్:
ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్న బోనికపూర్ భార్య శ్రీదేవి కూడా 2018 వ సంవత్సరంలో కన్నుమూసింది. బోనీకి అప్పటికే పెళ్లయ్యి పిల్లలు ఉన్నా కూడా తన కంటే వయస్సులో చాలా చిన్నదే అయిన శ్రీదేవిని రెండో పెళ్లి చేసుకున్నాడు. శ్రీదేవి కూడా ఇంకా మంచి భవిష్యత్తు ఉండగానే.. తన ఇద్దరు కుమార్తెల సినీ జర్నీని చూడకుండానే చిన్న వయస్సులోనే దుబాయ్‌లో ఆకస్మికంగా మృతిచెందిన సంగతి తెలిసిందే.
6). డిస్కో శాంతి:
డిస్కో శాంతి భర్త అలనాటి హీరో శ్రీహరి. ఈయన 2013 వ సంవత్సరంలో హార్ట్ ఎటాక్‌తో మరణించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా వేషాలు వేసుకునే స్తాయి నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీహరి రియల్‌స్టార్‌గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అయితే మద్యానికి బాసిస కావడంతో లివర్ల ఎఫెక్ట్‌తో శ్రీహరి చిన్న వయస్సులోనే మృతిచెందారు.
7). కృష్ణ:
ఎన్నో సినిమాలలో నటించి సూపర్ స్టార్‌గా పేరు పొందాడు. ఈయన భార్య విజయనిర్మల 2019 వ సంవత్సరంలో మరణించింది. విజయనిర్మల చిన్న వయస్సులో మృతి చెందికపోయినా ఆమె చూడాల్సిన మంచి భవిష్యత్తు అందా చూసేశారు. ఆమె హీరోయిన్గా, నిర్మాతగా, దర్శకురాలిగా ఎన్నో అద్భుతమైన విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ వయస్సులో ఆమె లేకపోవడం కృష్ణకు లోటే.
8). దిల్ రాజు:
ఎన్నో చిత్రాలకు ప్రొడ్యూసర్ గా పేరు పొందిన దిల్ రాజ్ .. 2017 వ సంవత్సరంలో తన భార్య అనిత మరణించారు. అనిత కూడా నాలుగున్నర పదుల వయస్సులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అనిత మరణాంతరం దిల్ రాజు మళ్లీ రెండో పెళ్లి చేసుకున్నాడు.
9). జయసుధ:
ఎంతోమంది స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్ జయసుధ ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది. ఈమె భర్త నితిన్ కపూర్ 2017లో మరణించారు. జయసుధ పిల్లలు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కు కోవాల్సిన టైంలో భర్తను కోల్పోవడం బాధాకరం.