బాలకృష్ణ హీరోగా అఖండ తర్వాత వస్తోన్న సినిమా జై బాలయ్య. సినిమా టైటిల్ అధికారికంగా చెప్పకపోయినా ఈ టైటిల్ రిజిస్టర్ చేయడంతో దాదాపు ఇదే టైటిల్‌తో సినిమా రాబోతోందన్నది మాత్రం క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాకు చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. అటు మైత్రీ మూవీస్ బ్యానర్, క్రాక్ తర్వాత ఫామ్‌లో ఉన్న మలినేని గోపీచంద్ దర్శకుడు, థమన్ మ్యూజిక్.. శృతీహాసన్ హీరోయిన్.. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనపించడం.. అటు కన్నడ యంగ్ హీరో దునియా విజయ్ విలన్.
వీటికి తోడు ఈ సినిమా స్టోరీ లైన్ ఫ్యాక్షన్ నేపథ్యంలో ముడిపడి ఉంటుంది.. సినిమా స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అయితే లీక్ అయ్యింది. అనంతపురం జిల్లాలో పల్లెటూరికి, అటు ఢిల్లీతో పాటు ఫారిన్ నేపథ్యం.. ఇలా అంశాలతో కథ మిక్స్ అయ్యి ఉంటుందంటున్నారు. ఈ సినిమా ఫస్టాఫ్ అంతా అనంతపురం పల్లెటూర్లో ఫ్యాక్షన్ వాతావరణంలో ఉంటుందట… ఇంటర్వెల్ టైంకు ఢిల్లీకి షిఫ్ట్ అవుతుందని.. అక్కడ ఓ భారీ ఫైట్ ఉంటుందంటున్నారు.
ఇక సెకండాఫ్ అంతా ఫారిన్ నేపథ్యం కూడా కొంత ఉంటుందని.. ఫారన్‌లో కూడా ఓ భారీ చేజింగ్ సన్నివేశం ఉంటుందని తెలిసింది. బాలయ్య చివరగా చెన్నకేశవరెడ్డి లాంటి పవర్ ఫుల్ ఫ్యాక్షన్ సినిమాలో నటించారు. ఇప్పుడు మళ్లీ అదే స్టైల్లో ఈ సినిమా పవర్ ఫుల్‌గా ఉంటుందంటున్నారు. ఇందులో అన్న, చెల్లి, బావ ప్రతీకారాలు… పిల్లల్ని ఎవ్వరికి తెలియకుండా విదేశాల్లో పెంచడం లాంటి పాయింట్‌తో స్టోరీ అల్లుకున్నాడట దర్శకుడు గోపీ..!
బాలయ్య డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు.. ఫస్టాఫ్‌లో ఒకపాత్ర.. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి రెండో పాత్ర ఎంటర్ అవుతుందట. ఇక సినిమా ఫస్టాఫ్‌లోనే మూడు భారీ ఫైట్లు ఉంటాయని చెపుతున్నారు. ఇంటర్వెల్ ఫైట్ ఢిల్లీ సమీపంలోని గుర్గావ్‌లో చిత్రీకరిస్తున్నారు. సెకండాఫ్‌లో వచ్చే ఓ ఫైట్ మాత్రం ఫారిన్‌లో ఉంటుందని తెలిసింది.
సాధారణంగా ఫ్యాక్షన్ సినిమాలు అంటే గొడ్డళ్లు, కత్తులతోనే ఫైట్లు ఉంటాయి. అయితే ఈ సినిమాలో తుపాకులు కూడా స్పెషల్‌గా ఉండనున్నాయంటున్నారు. ఓవరాల్‌గా సినిమాలో కథ కన్నా భయంకరమైన ఎలివేషన్లు ఉంటాయని చెపుతున్నారు. ఆ మాటకు వస్తే బాలయ్య రీసెంట్ బ్లాక్‌బస్టర్ అఖండలోనూ ఓ దశ దాటాక కథను ఎలివేషన్లు డామినేట్ చేసేశాయి. ఇప్పుడు మలినేని కూడా అదే టెక్నిక్‌తో వెళితే థియేటర్లలో మాస్ జాతర ఖాయం.