టాలీవుడ్ సినీ పరిశ్రమలో సీనియర్ నటీమణిగా ప్రస్తుతం రమ్యకృష్ణకు ఉన్న పాపులారిటీ ఏపాటిదో అందరికీ తెలిసిందే. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన బాహుబలి సిరీస్ చిత్రాలతో అసాధారణమైన క్రేజ్ దక్కింది. ఇందులో శివగామి పాత్రలో రమ్యకృష్ణ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరినీ
ఆకట్టుకుంది. అప్పట్లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన నరసింహా సినిమాలో నీలాంబరిగా నటించి ఎంతటి క్రేజ్ తెచ్చుకుందో ఇప్పుడు బాహుబలి సిరీస్ అంతకు రెట్టింపు క్రేజ్‌ను తెచ్చిపెట్టింది.
ఒకదశలో వరుసగా క్రేజీ చిత్రాలలో నటించి ఆకట్టుకున్న రమ్యకృష్ణ దర్శకనిర్మాతలకు డేట్స్ సర్దుబాటు చేయడానికి చాలా ఇబ్బంది పడింది. అంతగా తనకు అవకాశాలు దక్కాయి. ఇటు తెలుగులో అటు తమిళంలో క్రేజీ స్టార్స్ సరసన నటించే అవకాశాలు ఊపిరాడకుండా వచ్చాయి. పక్కా కమర్షియల్
సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రమ్యకృష్ణ అన్నమయ్య లాంటి భక్తి ప్రధానమైన సినిమాలోనూ నటించి సూత్రధారులు లాంటి విభిన్న కథా చిత్రంలో అమాయకమైన పాత్రలో కనిపించి అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే, కెరీర్ ప్రారంభంలో రమ్యకృష్ణ అంటే ఐరెన్ లెగ్ అనే ముద్ర ఉండేది. మన సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. హీరోయిన్స్ నటించిన రెండు మూడు సినిమాలు గనక వరుసగా ఫ్లాపయితే ఐరెన్ లెగ్ అని పక్కన పెట్టేస్తారు. అలాంటి పక్కన పెట్టిన రమ్యకృష్ణను సీనియర్ దర్శకుడు
దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు తన సినిమాలలో అవకాశాలు ఇచ్చారు. అప్పట్లో ఆయన దర్శకత్వం వహించిన వరుస సినిమాలలో ఎక్కువగా ఈమెకే హీరోయిన్‌గా అవకాశాలు కల్పించారు. దానివల్లే ఆ తర్వాత రమ్యకృష్ణ స్టార్ హీరోయిన్‌గా చలామణి అయింది.
ఐరెన్ లెగ్ అనే ముద్ర చెరిగిపోయి లక్కీ హీరోయిన్..హిట్ పెయిర్ అనే పేరు తెచ్చుకుంది. అయితే, దర్శకేంద్రుడు ఇలా వరుసగా అవకాశాలు ఇస్తుండటంతో ఇండస్ట్రీ జనాలు రకరకాల వార్తలు పుట్టించారు. అయితే అవేవి నిజం కాదన్న ప్రచారం కూడా తర్వాత జరిగినా… కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాలో సంగీత పాత్రను కృష్ణవంశీ కావాలని డిజైన్ చేశారన్న ప్రచారమూ జరిగింది. ఇక సెకండ్ ఇన్సింగ్స్‌లో రమ్యకృష్ణ వెనక్కు తిరిగి చూసుకునే ఛాన్స్ లేకుండా దూసుకుపోతోంది. ప్రస్తుతం, రమ్యకృష్ణ భర్త డైరెక్షన్‌లో రంగ మార్తాండ సినిమా చేస్తుంది.