నందమూరి ఫ్యామిలీ హీరో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అంటే అభిమానుల్లో ఉండే ఉత్సాహం, ఆరాటం మరో లెవల్. తారక్ సినిమా అంటే విందుభోజనం ఆశిస్తారు. ఆయన కూడా అలాంటి కథలనే ఎంచుకుంటున్నారు. సినిమా సినిమాకు ఓ శిఖరం లాగా ఎదుగుతున్న తారక్..ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ఇప్పుడు ఆయన ఒప్పుకుంటున్న ప్రతీ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ఉంటోంది. అంతేకాదు, ఎక్కువగా భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండే విధమైన కథలనే ఎంచుకుంటున్నారు.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్ నటించబోతున్న సినిమాకు సంబంధించిన దాదాపు ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ కంప్లీట్ అయింది. జూలై నుంచి సెట్స్ మీదకు తీసుకువచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అలాగే, వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్ హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే భారీ చిత్రం మొదలవబోతోంది. అయితే, కమర్షియల్ సినిమా అయినా ఫ్యాక్షన్ సినిమా అయినా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయినా ఎన్.టి.ఆర్ అదిరిపోయే డాన్సులు వేయాల్సిందే. అలాంటి పాటలు సినిమాలో రెండైనా ఉండాల్సిందే.
డాన్స్ అంటే తారక్ రెట్టింపు ఉత్సాహంతో రెడీ అయిపోతారు. 13 ఏళ్ల నుంచే కూచిపూడి నేర్చుకొని ఉండటంతో డాన్స్ మీద చాలా ఆసక్తి ఉంటుంది. అయితే, తారక్ నుంచి ఎక్కువశ ఆశిస్తారనే ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమాలో నాచోరే నాచోరే పాటకు చాలా క్లిష్ఠమైన డాన్స్ మూవ్‌మెంట్స్ కంపోజ్ చేశారు. అది స్పెషల్ సాంగ్.
ఈ సాంగ్‌లో సీనియర్ హీరోయిన్ రంభ తారక్ సరసన ఆడిపాడింది. అయితే, ప్రేమ్ రక్షిత కంపోజ్ చేసిన స్టెప్స్ చాలా ఠఫ్‌గా ఉంటుండటంతో అప్పుడు తారక్ కాలికి ఫ్రాక్చర్ అయింది. చాలా రోజులు తీవ్ర నొప్పితో బాధపడ్డారు. అయినా మళ్ళీ ఆ సాంగ్ కోసం రెడీ అయ్యారు. దాదాపు 40 రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందట. కానీ, సినిమాలో సాంగ్ చూస్తే ఎక్కడ కూడా ఆ తేడా కనిపించదు. అది డ్యాన్స్ విషయంలో ఎన్టీఆర్ డెడికేషన్.