ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. శివసేన ప్రభుత్వం ఉంటుందా ? ఊడుతుందా ? అన్న ఊగిసలాటలో ఉంది. ఇప్పుడు రెబల్ ఎమ్మెల్యేలు అందరిని తమ వైపునకు రావాలని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే భార్య విన్నవిస్తోంది. ముఖ్యంగా రెబల్ ఎమ్మెల్యేల భార్యలను కలుస్తూ ఆమె అభ్యర్థిస్తోంది. ఇప్పుడు మహా రాజకీయాల్లో రష్మీ ఠాక్రే హైలెట్ అవుతున్నారు. ఆమె కేంద్రబిందువు అవుతున్నారు. అసలు ఒకప్పుడు ఆమె ప్లాష్‌బ్యాక్‌లోకి వెళితే ఓ చిరుద్యోగి. పొట్ట పోసుకుంటూ కుటుంబాన్ని పోషించేది.
నేడు ఆమె దేశంలోనే పెద్ద రాష్ట్రాల్లో ఒకటి అయిన మహారాష్ట్ర సీఎం భార్యగా ఉంది. అసలు ఆమె ప్రేమ నుంచి పెళ్లి దాకా ఏం జరిగిందో తెలుసుకుందాం. ముంబై సమీపంలోని డొంబివిలి ఓ చిన్న పట్టణం. అక్కడ ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలోని ముగ్గురు పిల్లల్లో రెండో అమ్మాయి ఈ రష్మీ పటాంకర్. బీకాం వరకు చదువుకుంది. అసలీ కుటుంబానికి రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేదు. చాలీచాలని ఆదాయంతో ఉండేది.
చదువు అయిపోగానే ఇంట్లో గడవకపోవడంతో ఎల్ఐసీలో కాంట్రాక్ట్ ఉద్యోగినిగా చిన్న జీతానికి చేరింది. అక్కడ రష్మీకి ఓ ఫ్రెండ్ దొరికింది. ఆమె రాజ్ ఠాక్రే సోదరి. అప్పుడు బాల్ ఠాక్రేకు రాజ్ ఠాక్రే రైట్ హ్యాండ్‌గా ఉన్నాడు. అందరూ కూడా ఆయనే బాల్ ఠాక్రే వారసుడు అనేవాళ్లు. ఆ ఫ్రెండ్ పేరు జైజవంతి ఠాక్రే. ఆమే రష్మిని ఉద్దవ్‌కు పరిచయం చేసింది. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్దవ్ బాల్ ఠాక్రేకు మూడో కొడుకు.. అందరిలోనూ చిన్నోడు.
ఫొటోగ్రఫీ మీద ఆసక్తితో ఓ చిన్న అడ్వైటైజింగ్ ఏజెన్నీ నడిపించుకునేవాడు. అయితే రష్మీ – ఉద్దవ్ మనస్సులు కలవడంతో పాటు ప్రేమలో పడ్డారు. బాల్ ఠాక్రేకు విషయం తెలిసింది. ఆమెది తన కుటుంబ స్థాయికి తగిన కుటుంబం కాకపోయినా ఎక్కడో నచ్చేసింది. పెళ్లికి ఓకే చెప్పడంతో 1989లో పెళ్లయ్యింది. చాలా రోజుల పాటు ఆమెకు బయట ప్రపంచం తెలియదు. తన పిల్లలు ఆదిత్య, తేజస్ భర్తే లోకంగా గడిపింది.
ఇటు భర్త ఉద్దవ్ ఆమె మాటకు విలువ ఇస్తాడు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయాలన్న అనిశ్చితి వచ్చనప్పుడు కూడా రష్మి ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో కలిసి ఎత్తులు వేసి భర్త ఉద్దవ్‌ను సీఎంను చేసింది. ఇప్పుడు వారి పత్రిక సామ్నాకు ఎడిటర్ అయ్యింది. ఇంతకు ముందు మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ సీఎం భార్యగా లైమ్‌లైట్‌లో బాగా కనిపించేది. కానీ రష్మీ ఠాక్రే ఎక్కడా బయట కనపడదు.. ఆమె చాతుర్యం.. చతురత వేరు.