టాలీవుడ్‌లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన పనేదో ఆయన చేసుకుంటూ పోతారు. ఎవ్వరిని నొప్పించే మనస్తత్వం కాదు వెంకటేష్‌ది. ఎక్కువుగా తాత్విక చింతనతో వెంకటేష్ ఉంటారు. వెంకటేష్ తాజాగా ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సీనియర్ హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు కాస్త తటపటాయిస్తున్నా వెంకీ మాత్రం ఇప్పుడున్న యంగ్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేసే విషయంలో స్పీడ్‌గా ఉంటారు.
ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో దివంగత హీరో శోభన్‌బాబు తర్వాత ఫ్యామిలీ కథా చిత్రాలతో ఇంటిల్లపాది చూసే సినిమాల్లో నటించింది వెంకటేషే. ట్రెండ్‌కు తగినట్టుగా తనకు తనను మార్చుకోవడంలో వెంకటేష్ ఎప్పుడూ ముందుంటారు. అవసరం అయితే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా తన నారప్ప, దృశ్యం 2 సినిమాలను ఓటీటీలో కూడా రిలీజ్ చేసి సక్సెస్ కొట్టారు.
దివంగత లెజెండ్రీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన వెంకటేష్ ముందుగా హీరో అవ్వాలనుకోలేదట. బిజినెస్‌మ్యాన్ అవ్వాలని అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తుండగా.. సడెన్‌గా హీరో అవుతానని చెప్పడంతో కలియుగ పాండవులు సినిమాతో వెంకటేష్‌ను హీరోను చేశారు రామానాయుడు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
ఇక వెంకటేష్ ఆస్తుల లెక్కలు ఓ బ్రహ్మపదార్థంగా ఉంటాయని ఇండస్ట్రీ వాళ్లు చెపుతుంటారు. ఇటు తాను సినిమా హీరోగా సంపాదించుకున్న ఆస్తులతో పాటు తన తండ్రి రామానాయుడు నుంచి వచ్చిన స్థిర, చరాస్తులు కూడా చాలానే ఉన్నాయి. వెంకటేష్‌కు హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో ఇంద్రభవనం లాంటి ఇళ్లు ఉంది. వెంకటేష్ తాను స్వయంగా సంపాదించుకున్న సంపాదనను హైదరాబాద్, బెంగళూరు రియల్ ఎస్టేట్‌లో పెట్టాడట.
అయితే తండ్రి నుంచి వచ్చిన ఆస్తుల్లో ఇంకా చాలా వరకు సురేష్‌బాబు కంట్రల్లోనే ఉన్నాయని ఇండస్ట్రీ వాళ్లు చెవులు కొరుక్కుంటూ ఉంటారు. సురేష్‌బాబు లెక్క ఆయనది. ఆయన పక్కా బిజినెస్‌మేన్.. తన దగ్గర రూపాయి ఉంటే దానిని పోగొట్టకుండా చాలా జాగ్రత్తగా దాని విలువ పెంచుతానన్నది ఆయన నమ్మకం. అది నిజం కూడా..! అందుకే తండ్రి ఇచ్చిన స్టూడియో, ఇతర సినిమా సంబంధమైన ఆస్తులను ఇంకా పంచలేదని అంటారు.
తండ్రితో సంబంధం లేకుండానే వెంకటేష్‌కు స్వార్జితం, అటు భార్యవైపు నుంచి వచ్చిన కట్న, కానుకలు లెక్కిస్తేనే రు. 2200 కోట్ల వరకు ఉంటుందంటారు. ఇది ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం చెపుతోన్న మాట. అదే తండ్రి నుంచి వచ్చిన ఆస్తులు, ఇంకా రావాల్సిన ఆస్తుల విలువ కూడా కలుపుకుంటే వెంకటేష్ ఆస్తుల విలువ రు. 5 వేల కోట్ల పైమాటే అని టాక్ ? ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా చాలా సింపుల్‌గా ఉండడం వెంకటేష్ నైజం.