సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయ లోకం ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు. స్టార్స్ గా ఉన్న వాళ్లు జీరోని చేసేసి..కెరీర్ లేకుండా చేసింది ఈ రంగుల ప్రపంచం. ఆ లిస్ట్ లో ముందు వరుసలో ఉంటాడు ఉదయ్ కిరణ్. తెలుగు ఇండస్ట్రీకి దూసుకొచ్చిన తారాజువ్వ ఉదయ్ కిరణ్. వరస విజయాలతో అప్పట్లో సంచలనం సృష్టించాడు ఈ హీరో అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పట్లో ఉదయ్ సినిమాలు వస్తున్నాయ్ అంటే ధియేటర్స్ అమ్మాయిలు భారీ సంఖ్యలో వచ్చేవారు. అంతటి లేడీ ఫాలోయింగ్ ఉన్నింది ఉదయ్ కి.
‘చిత్రం’ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఉదయ్ ఆ తర్వాత ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ సినిమాలతో హ్యాట్రిక్ పూర్తిచేశాడు. అప్పట్లోనే లవర్ బాయ్ ఇమేజ్ను సొంతం చేసుకున్న యంగ్ హీరో. వరుసగా విజయవంతమైన చిత్రాల్లో నటించి టాప్ హీరోలకు సైతం పోటీనిచ్చాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సరికొత్త సంచలనాలకు తెర తీశాడు ఉదయ్ కిరణ్. అయితే, ఎంత ఫాస్ట్ గా ఎదిగాదో..అంతేఫాస్ట్ గా డౌన్ అయ్యాడు. సినీ ఇండస్ట్రీలోని మాయలకు ..నెపోటిజం కు తట్టుకోలేకపోయాడు. దీంతో ఫైనాన్షియల్ బాధలు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు.
అయితే, ఉదయ్ కిరణ్ కెరీర్ దెబ్బ తినడానికి ఆయన మూవీ చూసింగ్ లే కారణం అంటూ ఓ న్యూస్ అప్పట్లో షికారు చేసింది. వరుస లవ్ స్టోరీ సినిమాలకు ఫిక్స్ అవ్వడంతోనే ఆయన నటన బోర్ కొట్టిందని సినీ విశ్లేషకులు చెప్పుకొచ్చారు. కాగా, రాజమౌళి తెరకెక్కించి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సై సినిమా కధ ముందుగా ఉదయ్ కే వినిపించాడట జక్కన్న..
అయితే, ఆ టైంలో ఆయన కొన్ని ప్రాబ్లామ్స్ వల్ల టైం అడగటం..రాజమౌళికి కుదరక నితిన తో సినిమా కంప్లీట్ చేయడం..సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం చకచకా జరిగిపోయింది. నితిన్ కెరీర్ కి సై సినిమా ఎంత ప్లస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ రోజు రాజమౌళి ఉదయ్ కోసం కొన్ని రోజులు వెయిట్ చేసుంటే..ఈరోజు ఉదయ్ కి ఈ పరిస్ధితి వచ్చేది కాదనేది ఉదయ్ అభిమానుల వాదన. ఏది ఏమైన ఉదయ్ లేని లోటు ఇండస్ట్రీకి తీరనిది.