సినీ రంగంలో అన్నగారు ఎన్టీఆర్.. ప్రభ గురించి అందరికీ తెలిసిందే. ఆయన వేయని వేషం లేదు. నటించని.. రోల్ అంతకన్నా లేదు. పౌరాణికం నుంచి జానపదం వరకు.. సాంఘికం నుంచి చారిత్రకం పాత్రల వరకు.. ఎన్టీఆర్ అనేక పాత్రలు పోషించారు. అయితే.. అలనాటి రోజుల్లో అన్నగారిని పౌరాణిక పాత్రలు.. జానపద పాత్రల్లోనే ఎక్కువగా డైరెక్టర్లు.. నిర్మాతలు ప్రోత్సహించేవారు.. సాంఘిక పాత్రలకు.. ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు.
ఎందుకంటే.. పౌరాణిక, జానపద పాత్రల్లో.. అన్నగారిని చూసిన జనాలు.. సాంఘిక పాత్రలకు ఇష్టపడతారో.. లేదో.. అనే భయం నిర్మాతలకు.. దర్శకులకు ఉండేది. దీంతో రెండు దశాబ్దాల పాటు.. అన్నగారు.. కేవలం ఈ సినిమాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చింది. అయితే.. ఈ విషయంలో అలనాటి నటి అంజలీ దేవి తొలిసారిగా.. అన్నగారిని సాంఘిక సినిమాలకు ప్రోత్సహించారు. నిజానికి అప్పట్లో ఇది సాహసమనే చెప్పాలి. అయినప్పటికీ.. అంజలీ దేవి పట్టుబట్టి.. అన్నగారితో సాంఘిక సినిమా చేయించారట.
అయితే.. ఇక్కడ కూడా ఒక ట్విస్టు ఉంది. ఆ సాంఘిక సినిమాలో అన్నగారు.. వయసుకు మించిన పాత్రను పోషించాల్సి వచ్చింది. అదే.. బడిపంతులు సినిమా. ఈ సినిమాలో అన్నగారు స్కూల్ టీచర్‌గా నటించారు. అయితే.. అప్పటికి అన్నగారి వయసు 45 సంవత్సరాలే. కానీ, ఆ సినిమాలో ఆయనను 55 ఏళ్ల వయసున్న పాత్రలో చూపించారు. అంతేకాదు.. అన్నగారి రోల్ హీరోగా కన్నా.. సమాజోద్ధరణ దిశగా సాగుతుంది. దీంతో ఆయన ఇష్టపడలేదట.
కానీ, అంజలీదేవి పట్టుబట్టి.. ఈ సినిమాలో నటిస్తే.. మీపై ఉన్న పౌరుణిక, జానపద ముద్ర తొలిగిపోతుంద ని.. చెప్పారట. అంతేకాదు.. ఈ సినిమాకు అప్పటికే అడ్వాన్సు ఇవ్వాలని అనుకున్న మరో సీనియర్ నటుడుని కూడా అంజలీదేవి తప్పించి.. అన్నగారితో పట్టుబట్టి ఈ సినిమాలో యాక్ట్ చేయించారట. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో.. ఇక, అప్పటి నుంచి అన్నగారికి సాంఘిక సినిమాల అవకాశాలు.. కుప్పలు తెప్పలుగా వచ్చాయని అంటారు. మొత్తానికి అంజలీదేవి ప్రోత్సాహం బాగానే ఉందనే టాక్ వినిపించడం గమనార్హం.