MoviesSSMB 28 : ఫ‌స్ట్ లుక్ అప్‌డేట్ వ‌చ్చేసింది... మ‌హేష్ ఫ్యాన్స్‌కు...

SSMB 28 : ఫ‌స్ట్ లుక్ అప్‌డేట్ వ‌చ్చేసింది… మ‌హేష్ ఫ్యాన్స్‌కు పండ‌గే..!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు తాజాగా స‌ర్కారు వారి పాట సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మెప్పించాడు. ఈ సినిమాకు హిట్ టాక్ వ‌చ్చినా అంచ‌నాల‌కు మంచి ప్రి రిలీజ్ బిజినెస్ జ‌ర‌గ‌డం.. అది కూడా మ‌హేష్ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్‌గా రు. 121 కోట్ల‌కు అమ్మ‌డంతో రు. 10 కోట్ల వ‌ర‌కు న‌ష్టాలు త‌ప్ప‌లేదు. మ‌హేష్ కెరీర్‌లో భ‌ర‌త్ అనే నేను – మ‌హ‌ర్షి – స‌రిలేరు నీకెవ్వ‌రు – స‌ర్కారు వారి పాట ఇలా వ‌రుస హిట్ల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు.

ఇలాంటి టైంలో వ‌రుస‌గా త్రివిక్ర‌మ్, రాజ‌మౌళి సినిమాలు మ‌హేష్ చేతిలో ఉండ‌డం అంటే మ‌హేష్ గ్రాఫ్ మామూలుగా లేద‌నే చెప్పాలి. ఇక మ‌హేష్ – త్రివిక్ర‌మ్ సినిమా ప్రారంభోత్స‌వం కూడా ఇప్ప‌టికే జ‌రుపుకుంది. హీరోయిన్‌గా పూజా హెగ్డే ఎంపికైంది. మ‌ది సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా.. థ‌మ‌న్ స్వ‌రాలు ఇస్తున్నాడు. ఇలా భారీ కాస్టింగ్‌, టెక్నీషియ‌న్ టీంతో స్టార్ట్ అయిన ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ జ‌రుగుతుందా ? అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు.

ఎప్పుడో 2005లో మ‌హేష్ – త్రివిక్ర‌మ్ కాంబోలో అత‌డు సినిమా వ‌చ్చింది. త‌ర్వాత 2010లో ఖ‌లేజా వ‌చ్చింది. అంటే ఈ 12 ఏళ్ల‌లో మ‌ళ్లీ మ‌హేష్ – త్రివిక్ర‌మ్ సినిమా రాలేదు. అంటే మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు వీరి కాంబోలో సినిమా వ‌స్తుండ‌డంతో అంచ‌నాలు అయితే మామూలుగా లేవు. త్రివిక్ర‌మ్ కూడా మ‌హేష్‌కు ఈ సారి ఎలాగైనా హిట్ ఇవ్వాల‌ని క‌సితోనే ఈ ప్రాజెక్ట్‌ను టేకాఫ్ చేశాడు.

ఇక ఈ సినిమా గురించి అదిరిపోయే అప్‌డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం రోజున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మ‌హేష్ ఈ సినిమాలో డిఫ‌రెంట్ రోల్ చేస్తున్నాడు. త్రివిక్ర‌మ్ స్టైల్ ఫ్యామిలీ స్టోరీతో పాటు ఈ సారి యాక్ష‌న్ కూడా మిక్స్ చేసి మ‌రి ఈ సినిమాను డిజైన్ చేశాడ‌ట‌.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news