సమంత రూత్‌ప్రభు ఏ మాయ చేశావే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసందే. పెద్ద పెద్ద ఈవెంట్‌కు వెల్‌కం చెప్పే అమ్మాయిగా రోజుకు రు. 500 ఇస్తే చాలనుకున్న సందర్భాలు ఎన్నో చూసిన సమంత హీరోయిన్ అవుతుందని ఊహించలేదు. ఒకవేళ అయినా ఇంత పెద్ద స్టార్ హీరోయిన్‌గా వెలుగుతుందని, అక్కినేని కుటుంబానికి కోడలవుతుందని..అదే ఫ్యామిలీ నుంచి బయటకు వస్తుందని కలలో కూడా చూసుండదు. ఈ విషయాలన్నీ ముందే తెలిస్తే సమంత కెరీర్ మరోలా ఉండేది.
నాగ చైతన్యను మొదటి సినిమా నుంచే ప్రేమించిన సమంత మరో హీరోతో ప్రేమాయణం సాగించిందని వార్తలు వచ్చిన కొందరు దర్శకనిర్మాతలతో సన్నిహితంగా మెలుగుతుందని ప్రచారం జరిగినా నాగ చైతన్య కావాలని పట్టుపట్టడంతో నాగార్జున ఫ్యామిలీ సమంతను కోడలుగా చేసుకునేందుకు అంగీకరించింది. సాధారణంగా మన సినీ తారలు ఏదో ఒక మత సాంప్రదాయప్రకారం పెళ్లి చేసుకున్నదే ఎక్కువగా చూశాము.
కానీ, సమంత – నాగ చైతన్యలు ఇటు హిందూ, అటు క్రిస్టియన్ మత సాంప్రదాయాల ప్రకారం ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అప్పటి వరకూ ఎన్ని పుకార్లు, రూమర్లు వచ్చినా సమంత – నాగ చైతన్య పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరూ వాటి గురించి మాట్లాడింది లేదు. నాగార్జునకు కోడలు అంటే చాలా గౌరవంగా చూశారు. అంతేకాదు, అన్నపూర్ణ స్టూడియోలో సామ్, చైతులకు నచ్చినట్టుగా గెస్ట్‌హౌజ్ కట్టుకున్నారు. ఇద్దరి పేర్ల మీద కామన్ ప్రాపర్టీస్ ఉన్నాయి.
మజిలీ వంటి సినిమాకు కామన్ ప్యాకేజీ రూపంలో రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇకపై మజిలీ లాంటి కథలు కావాలని మేకర్స్‌ను అడిగిన సందర్భాలూ ఉన్నాయి. అయితే, ఎక్కడ బెడిసి కొట్టిందో ఇప్పటి వరకు ఎవరూ క్లారిటీ ఇవ్వకపోయినా గత ఏడాది టాలీవుడ్‌లో మోస్ట్ లవబుల్ కపుల్‌గా ఉన్న సామ్, చైతూ విడాకులు తీసుకుంటున్న విషయాన్ని ప్రకటించి పెద్ద షాకే ఇచ్చారు. అయితే, విడాకుల తర్వాత సమంత ఒప్పుకుంటున్న కొన్ని బోల్డ్ పాత్రలు గానీ, కవర్ పేజీలపై కనిపించే డీప్ స్కిన్ షో స్టిల్స్ గానీ చూస్తే కేవలం డబ్బుకోసమే ఇలా చేస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి.
ఒకవేళ సమంత నిజంగా డబ్బుకోసమే ఇలాంటివి చేస్తుందీ అంటే మహా అయితే వీటి వల్ల ఎంత సంపాదిస్తుంది ఓ రు. 500 కోట్లు వెనకేసుకుంటుందేమో. అదే అక్కినేని కోడలుగా ఉంటే ఆమె కలలో కూడా ఊహించనంత ఆస్తి ఆమె సొంతమయ్యేది. నాగార్జున ఆస్తులు కొన్ని వేల కోట్ల పైమాటే. దీంతో పాటు ఫ్యూచర్‌లో అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు కూడా సమంతకే వచ్చేవి.
అమల తర్వాత మళ్ళీ అంత బాధ్యత సమంతదే అయ్యేది. జాయిన్ ప్రొడక్షన్ హౌజ్ మొదలుపెట్టినా నాగార్జున సపోర్ట్ ఉండేది. ఇలా చూసుకుంటే ఇంకా దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఎన్నో గొప్ప లాభాలు. రెండు పెద్ద కుటుంబాలకు కామన్ పర్సన్‌గా విపరీతమైన క్రేజ్ ఉండేది. ఇవన్నీ ఇప్పుడు లేనట్టే కదా..!