ఒకప్పుడు మన తెలుగు సినిమా గురించి మహా అయితే, తమిళ ఇండస్ట్రీలో మాట్లాడుకునే వారేమో. ఆ తర్వాత సౌత్ సినిమా ఇండస్ట్రీలైన తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలోనూ తెలుగు సినిమా గురించి మాట్లాడుకున్నారు. అంతేకాదు తెలుగు హిట్ సినిమాలను తమ భాషలలోకి రీమేక్ రూపంలో, డబ్బింగ్ రూపంలో విడుదల చేసుకొని మంచి లాభాలు పొందిన వారున్నారు. ఇక తెలుగులో బాలయ్య చేసిన ప్రయోగాలు మరో హీరో చేసినా అది బాలయ్య తర్వాతే అనుకోవాలి. ఆదిత్య 369 గానీ, భైరవ ద్వీపం గానీ, సమరసింహా రెడ్డి గానీ. కథాంశం ఏదైనా బాలయ్య చితక్కొట్టేస్తారంతే.
కొన్ని సినిమాలు హిందీ హీరోల సినిమాల రిలీజ్ సమయంలో రిలీజై ఇక్కడ భారీ విజయాన్ని అందుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఎప్పటి వరకో ఆలోచించకుండా బాలయ్య బాబు గత చిత్రం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గత చిత్రంతో పోల్చి చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. వరుస ఫ్లాపుల తర్వాత
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటించిన హ్యాట్రిక్ సినిమా అఖండ. ఈ సినిమా ఫస్ట్ రోర్ నుంచి కోత మొదలు పెట్టారు బాలయ్య. యూట్యూబ్‌లో అఖండ ఫస్ట్ రోర్ నుంచి ఎప్పుడు ఏ అప్‌డేట్ వదిలినా రికార్డ్సే.
ఇక సల్మాన్ ఖాన్ నటించిన అంతిమ్ సినిమా విడుదల సమయంలోనే బాలయ్య అఖండ విడుదలైంది. బాలయ్య సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ విడుదలైంది. ఇక సల్మాన్ అంతిమ్ అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఏ రకంగా చూసుకున్న సల్మాన్
మార్కెట్ పరిధి చాలా ఎక్కువ. అలాంటి సల్మాన్ సినిమాను బాలయ్య మన ఇండియాలో మాత్రమే కాక అమెరికాలోనూ చితక్కొట్టి పక్కన పడేశారు.
అఖండతో అసలు ఎలాంటి పోలికా పెట్టడానికి వీలు లేకుండా అంతిమ్ వసూళ్ళు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అసలు మన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను పట్టించుకుందే లేదు. అది బాలయ్య స్టామినా. ఇక ఇదే ఊపును బాలయ్య తన 107 సినిమాతో పాటు తర్వాత లైన్లో ఉన్న స్ట్రాంగ్ లైనప్‌తోనూ కంటిన్యూ చేసేందుకు రెడీగా ఉన్నాడు.