ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ పెళ్లి, సహజీవనం, పెళ్లిపై నరేష్ చేసిన వ్యాఖ్యల గురించే చర్చ నడుస్తోంది. మామూలుగా గత యేడాదిన్నర కాలంగా వీళ్లిద్దరు కలిసే ఉంటున్నారని అంటున్నారు. ఎక్కడ చూసినా కూడా వీళ్లిద్దరు కలిసే కనిపిస్తున్నారు. కృష్ణ ఇంట్లో ఏ ఫంక్షన్లు కలిసినా పవిత్ర, నరేష్ కలిసే హాజరవుతున్నారు. అప్పుడే చాలా మందికి అనుమానాలు వచ్చాయ్. అయితే కాలం గుడస్తున్న కొద్దీ వీరి బంధం మరింత స్ట్రాంగ్ అవుతోందనే అర్థమవుతోంది.
ఇటీవల మహాబలేశ్వరంలో వీరిద్దరు కలిసి ఓ స్వామిజీని దర్శించుకున్నారు. ఇక వీరి పెళ్లికి అంతా రెడీ అన్న ప్రచారం ఇప్పుడు బలంగా బయటకు వచ్చేసింది. దీంతో నరేష్ స్పందించక తప్పలేదు. తన జీవితంలో మూడు పెళ్లిళ్లు పెటాకులు అవ్వడాన్ని తన కోణంలో బాగానే సమర్థించుకున్నాడు. సినీ ఆర్టిస్ట్‌కు మొదటి భార్య పెళ్లమే అని.. ఆ జీవితాన్ని అర్థం చేసుకోని వాళ్లు కలిసి ఉండలేరని చెప్పుకువచ్చాడు.
ఇక నరేష్‌కు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అన్నది బాగానే వైరల్ అవుతోంది. మరి పవిత్ర కోణం నుంచి చూస్తే.. ఆమెకు ఇది రెండో పెళ్లి అవుతుంది. పవిత్ర ముందుగా కన్నడ సీరియల్స్‌లో ఎంట్రీ ఇచ్చి అక్కడ 20కు పైగా సీరియల్స్ చేసింది. తర్వాత ఆమె సినిమాల్లోకి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది. సీరియల్స్‌లో పనిచేస్తోన్న టైంలోనే కన్నడ సీరియల్ నటుడు సుచేంద్ర ప్రసాద్‌తో ప్రేమలో పడి అతడిని పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి 2007లో జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కొన్ని మనస్పర్థల కారణంగా వీరు విడిపోయారు. అయితే వీరు వేర్వేరుగా ఉంటున్నా.. విడాకులు తీసుకోలేదు. త్వరలోనే వీరికి విడాకులు మంజూరు అవుతాయని అంటున్నారు. అయితే పవిత్ర భర్త సుచేంద్ర ప్రసాద్‌కు పవిత్ర మొదటి భార్య కాదు.. అంతకు ముందే 2002లో కన్నడ నటి మల్లికను అతడు వివాహం చేసుకున్నాడు. ఆమెకు 2006లో విడాకులు ఇచ్చి.. 2007లో పెళ్లి చేసుకున్నాడు.
అలా సుచేంద్ర జీవితంలోకి పవిత్ర రెండో భార్యగా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఆమె అతడికి దూరమై నరేష్‌కు దగ్గరవుతోన్న వాతావరణమే ఉంది. అయితే నరేష్ తన మూడో భార్యకు విడాకులు ఇచ్చాడా ? లేదా ? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. మొన్నామధ్య తన మూడో భార్య రమ్య రఘుపతికి తనకు సంబంధం లేదని చెప్పాడు.