నట సింహం నందమూరి బాలకృష్ణతో ఒక్కసారి సినిమా చేసిన ఏ దర్శకుడైనా మళ్ళీ మళ్ళీ ఆయనతో సినిమా చేయాలనే తాపత్రయంతో ఎదురుచూస్తుంటారు. పక్కా పూరి జగన్నాథ్ భాషలో చెప్పాలంటే బాలయ్య బాబుతో లవ్‌లో పడతారు. పూరి జగన్నాథ్, బాలకృష్ణ కాంబినేషన్‌లో పైసా వసూల్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అసలు ఈ కాంబినేషన్ గురించి ఎవరూ ఊహించలేదు. పూరి కూడా ఊహించని విధంగానే బాలయ్యను ఈ సినిమాలో చూపించారు. రెండింతలు ఎనర్జీతో నటించిన బాలయ్య షాకిచ్చాడు. అసలు అంత ఎనర్జీగా సినిమాలో ఫైట్స్, డాన్స్, కార్ ఛేజింగ్ సీన్స్‌లో కనిపిస్తారని అనుకోలేదు. ఇదే అందరికీ నచ్చింది.
ముఖ్యంగా పూరి మార్క్ డైలాగులను బాలయ్య తన స్టైల్లో చెప్పడం నందమూరి అభిమానులనే కాక అందరినీ ఆకట్టుకుంది. రేయ్..నేను రామకృష్ణ థియేటర్ సందులో పెరిగానూ మనది నేల టికెట్ బ్యాచ్, బీహార్ నీళ్ళు తాగిలోళ్ళనే తీహార్ జైల్లో పోయించా..తు క్యారే హౌలే.., నా గుండెల్లో కాల్చే హక్కు ఇద్దరికే, ఒకటి ఫ్యాన్స్..రెండు ఫ్యామిలీ మెంబర్స్..అవుట్ సైడర్స్ నాట్ అలౌడ్..నన్ను నమ్ముకో ఉన్నదంతా పెట్టుకో..పైసా వసూల్.. ఇలాంటి డైలాగులు బాలయ్య చెప్తారని ఫ్యాన్స్ కూడా అనుకోరు. అందుకే, పైసా వసూల్ సినిమాను అంతగా ఎంజాయ్ చేశారు.
అయితే, బాలయ్యతో సినిమా తీసిన దర్శకుల్లో సీనియర్ దర్శకుడు బి గోపాల్, వి వి వినాయక్‌లకు ప్రత్యేక స్థానం ఉంటుందనడంలో సందేహమే లేదు. లారీ డ్రైవర్, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి భారీ హిట్స్‌ను బాలయ్యకు ఇచ్చారు బి గోపాల్. ఇక చెన్నకేశవ రెడ్డి లాంటి అద్భుతమైన సినిమాను ఇచ్చారు దర్శకుడు వి వి వినాయక్. వాస్తవంగా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా కంటే చెన్నకేశవ రెడ్డి బావుంటుందనే టాక్ అప్పట్లో వినిపించింది.
ఇది నిజం కూడా అనుకోవచ్చు. కానీ, ఇంద్ర 50వ రోజుకు చెన్నకేశవ రెడ్డి చిత్రాన్ని రిలీజ్ చేయాలనే హడావిడిలో పర్ఫెక్ట్‌గా తీయకుండానే రిలీజ్ చేశారు. లేదంటే చెన్నకేశవ రెడ్డి బాలయ్య కెరీర్‌లో ఖచ్చితంగా మైల్ స్టోన్ మూవీ అయి ఉండేది. ఈ లోటు వినాయక్‌కు అలాగే ఉండిపోయింది. ఇక బి గోపాల్ బాలయ్యతో ఎప్పుడెప్పుడు సినిమా తీయాలా అని కసితో ఉన్నారట. మరి వీరిద్దరికి బాలయ్య ఎప్పుడు అవకాశం ఇస్తారో తెలియదు గానీ, అదే జరిగితే మళ్ళీ చరిత్ర తిరగరాసే సినిమాలు బాలయ్య నుంచి రావడం గ్యారెంటీ.