Movies"నా డీవర్స్ కి కారణం ఆమె"..ఫస్ట్ టైం విడాకుల పై ఓపెన్...

“నా డీవర్స్ కి కారణం ఆమె”..ఫస్ట్ టైం విడాకుల పై ఓపెన్ అప్ అయిన సమంత..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత..అబ్బో అమ్మడి అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. చూసే కొద్ది చూడాలి అనిపించే అందం ఆమె సొంతం. కేవలం అందం పరంగానే కాదు..సమంత లో ఓ అద్భుతమైన నటి కూడా ఉంది. ఎలాంటి రోల్స్ ని అయిన అవలీల గా..ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ..లీనమైపోయి నటిస్తుంది. తెర పై ఆమె నటించిన పాత్ర చూస్తే..ఈ రోల్ ఆమె కోసమే డిజైన్ చేసారా అని అనిపించక తప్పదు. అంతలా ఆమె తన నటనతో మెప్పించగలదు.

సినిమాల పరంగా అమ్మడిని ఢీ కొట్టే భామ ఇంకా రాలేదు. కానీ, వ్యక్తిగతంగా మాత్రం సమంత ఈ మధ్య కాలంలో ఎక్కువుగా ట్రోల్ అవుతుంది. దానికి కారణం మనకు తెలిసిందే. సమంత తాను ఎంతో ఇష్టంగా ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో నాగచైతన్య విడాకులు ఇవ్వడానికి సిద్ధపడింది. ఆమె విషయం ప్రకటించి దాదాపు తొమ్మిది నెలలు కావస్తున్నా..ఇప్పటికి సమంత-చైతన్య డివర్స్ పై రోజుకో కొత్త న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటుంది.

అయితే, ఇన్నాళ్లు విడాకుల పై మౌనం దాల్చిన సమంత ..రీసెంట్ గా పాల్గోన్న “కాఫీ విత్ కరణ్” షో లో ఫస్ట్ టైం తాను ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పేసిందంటూ..బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ బడా స్టార్ ..మల్టీ టాలెంటెడ్..నిర్మాత..కరణ్ జోహర్..కండక్ట్ చేస్తున్న “కాఫీ విత్ కరణ్ ” షో లో సమంత మాట్లాడుతూ..తన డివర్స్ కి కారణం చైతూ కాదని..మరో ఎక్స్ పర్సన్ ఉన్నారని..తన వల్లే ఈ కధ ఇంత దూరం వచ్చిందని..పరోక్షంగానే..విడాకులు తీసుకోవడానికి రీజన్ చెప్పేసిందట. దీంతో ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని అందరు వెయిట్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ డిస్ని హాట్ స్టార్ లో జూలై 7న టెలికాస్ట్ కానుంది. మరి చూడాలి సమంత ఈ షో లో ఏం చెప్పిందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news