యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కలిసి ఎన్టీఆర్ 30 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ గత ఏడాదే ప్రారంభం కావాలి కానీ కొన్ని కారణాల వల్ల అది ఇంకా పట్టాలు ఎక్కలేదు. ఆగస్టు నుంచి షూటింగ్ అంటున్నారు. షూటింగ్ లేట్ అవ్వడానికి ఆచార్య దెబ్బతో కొరటాల శివ స్క్రిప్ట్‌లో భారీ మార్పులు చేయడమేనని తెలుస్తోంది. దీనికి తోడు త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ మారింది. దానికి తగినట్టుగానే కథ, కథనాల్లో మార్పులు చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక మోషన్ పోస్టర్ విడుదల అయింది. ఆ తర్వాత మూవీ నుంచి ఎలాంటి అప్‌డేట్స్ లేవు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ రెమ్యునరేషన్‌కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. జక్కన్న డైరెక్షన్‌లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్ అక్షరాల రూ.45 కోట్లు పుచ్చుకున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా మూడేళ్లు బల్క్ డేట్స్ ఇచ్చినట్టే లెక్క.
ఈ సినిమాలో రామ్‌చరణ్ కూడా ఉండడంతో దర్శకుడు రాజమౌళీయే స్వయంగా ఎన్టీఆర్, చెర్రీకు చెరో రు. 45 కోట్లు ఇవ్వమని నిర్మాత దానయ్యకు చెప్పడంతో దానయ్య అదే రేంజ్‌లో రెమ్యునరేషన్ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ .. కొరటాల సినిమాకు కెరీర్‌లోనే టాప్ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడు. పాన్ ఇండియా హీరోలకు మాత్రమే ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుతోంది.
ఆర్ఆర్ఆర్‌తో పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత తారక్‌కు మరింత డిమాండ్ పెరిగిందని తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడంతో పాటు హిందీ శాటిలైట్, యూట్యూబ్ రైట్స్ ద్వారా భారీగానే ఆర్జిస్తోన్న పరిస్థితి. ఈ పెరిగిన డిమాండ్ తో తారక్ ఎన్టీఆర్ 30 సినిమా కోసం ఏకంగా రూ.60 కోట్లు తీసుకుంటున్నాడని టాక్ నడుస్తోంది. ఈ సినిమా హిట్ అయితే తారక్ రేంజ్ పాన్ ఇండియా లెవల్లో మరింత పెరగడం ఖాయం.
ఎన్టీఆర్ 30 మూవీ కోసం హీరోయిన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం కూడా ఆసక్తికరంగా మారింది. మొదట ఆలియా భట్, కియారా అద్వానీ అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల వారిద్దరూ సినిమా చేయనున్నారు. ఇక పూజా హెగ్డే చాలా సినిమాలతో చాలా బిజీగా ఉంది. పాన్ ఇండియా మూవీ కావడంతో బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అది ఎవరు ? అన్నది కొద్ది రోజుల్లో తెలుస్తుంది.