నట సింహం నందమూరి బాలకృష్ణ ఇప్పటికే హీరోగా కమర్షియల్ సినిమాలు, మైథలాజికల్, హిస్టారికల్, సోషల్ మూవీస్ చేసి హిట్స్ అందుకున్నారు. ఇక ఫ్యాక్షన్ సినిమాలకైతే బాలయ్య కేరాఫ్ అడ్రస్ అని చెప్పక తప్పదు. యాక్షన్ అయినా ఫ్యాక్షన్ అయినా ఆయన సినిమాలోనే ఎక్కువగా
కనిపిస్తుంది. కత్తి పట్టి సమరసింహా రెడ్డిలా తొడ చరిచినా భక్తి పారవశ్యంతో శ్రీరాముడిలా, రామదాసులా కనిపించినా అభిమానులే కాదు యావత్ తెలుగు సినీ ప్రేమికులు, ప్రేక్షకులు నీరాజనం పలికారు.
నేను గట్టిగా తొడ చరిస్తే ఆ శబ్ధానికే గుండె ఆగిపోతుంది,..ష్ ష్ ష్ సౌండ్ చేయకు కంఠం కోసేస్తా.., కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోడానికి మీ ఆస్తులమ్మినా సరిపోదు, ప్లేస్ మారితితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్డు మారుతుంది..బ్లడ్ ఎందుకు మారుతుందిరా బ్లడీ ఫూల్..ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చెప్పిన వందల డైలాగులు వస్తూనే ఉంటాయి.
ఇక సీన్స్ విషయం అయితే, గుర్తొచ్చిన ప్రతీది యూట్యూబ్‌లో వందల సార్లు చూసుకోవాల్సిందే. ఒక్క సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి లేదు. విలన్ల నడ్డి విరగ్గొట్టే సీన్స్ అయినా..విలన్ ముందు మీసం మెలేసి ఛాలెంజ్ చేసే సీన్స్ అయినా, హీరోయిన్‌తో రొమాన్స్ చేసే సీన్స్ అయినా బాలయ్య ఇచ్చే
మాడ్యులేషన్ మరో లెవల్. సాంగ్స్‌లోనూ బాలయ్య స్టెప్స్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే బాలయ్య సినిమాలు చాలావరకు మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి.
అయితే, 110వ సినిమాకు తగ్గరగా చేరుకుంటున్న బాలయ్య నుంచి అభిమానులు కోరుకుంటుందీ కోట్ల కళ్ళతో ఎదురుచూస్తుందీ ఆయన దర్శకత్వం ఎప్పుడు చేస్తారూ అని. ఇప్పటివరకు పూర్తి స్థాయిలో సినిమాకు డైరెక్షన్ చేయలేదు బాలయ్య. అందుకే ఆయన నటించే ఓ సినిమాకు స్వయంగా
దర్శకత్వం వహించాలని ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేయాలని నందమూరి అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
గతంలో బాలయ్య డైరెక్షన్ చేయాలని రెండు సార్లు ప్రయత్నాలు జరిగాయ్. అయితే అవి కార్యరూపం దాల్చలేదు. తన తండ్రి ఎన్టీఆర్ హీరోగా చేసిన ఓ సినిమాను ముందుగా బాలయ్యే డైరెక్ట్ చేయాల్సి ఉంది. అయితే అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత బాలయ్య తన స్వీయ దర్శకత్వంలో నర్తనశాల సినిమా ప్రారంభమైంది. దివంగత నటి సౌందర్య మరణంతో ఆ సినిమా కూడా ఆగిపోయింది. మరి బాలయ్య ఎప్పటకి అయినా దర్శకత్వం చేయాలన్న కోట్లాది మంది అభిమానుల కోరిక ఇంకెప్పటకీ తీరుస్తాడో ? చూడాలి.