Moviesదసరా - సంక్రాంతి రెండూ బాల‌య్య‌కే... థియేట‌ర్ల‌లో జై బాల‌య్య గోలే...!

దసరా – సంక్రాంతి రెండూ బాల‌య్య‌కే… థియేట‌ర్ల‌లో జై బాల‌య్య గోలే…!

ఈసారి నట సింహం నందమూరి బాలకృష్ణ రెండు పెద్ద పండుగులకు తన సినిమాలను రెడీ చేస్తున్నారు. బాలయ్యకు బాగా కలిసొచ్చే సీజన్స్ దసరా, సంక్రాంతి. ఏదో ఒక్క శాతం తప్ప మిగిలిన 99 శాతం బాలయ్య సినిమాలు ఈ రెండు పండుగులకు వచ్చి బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు నమోదు
చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అటు క్లాస్, ఇటు మాస్ ఆడియన్స్‌ను అలరించేలా కథలను ఎంచుకునే బాలయ్య దేశంలోనే కాక విదేశాలలోనూ నందమూరి అభిమానులను, అభిమాన సంఘాలను ఏర్పరుచుకున్నారు. బాలయ్య సినిమా విడుదల అంటే అదే పెద్ద పండుగ.

ఆ రోజు పస్తులుండి మరీ బాలయ్య సినిమా థియేటర్స్ వద్ద సందడి చేసే అభిమానులు లక్షల్లోనే. అటువంటి అభిమానుల కోసం బాలయ్య సామాజిక ధృక్పథంతో వీలైనన్ని సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. బాలయ్య మాత్రమే కాదు ఆయన పేరిట వందల కొద్దీ ఉన్న అభిమాన సంఘాలు లక్షల్లో
ప్రజలకు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే, ఇటీవల అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నట సింహం బ్యాక్ టు బ్యాక్ పవర్ ఫుల్ స్టోరీలతో భారీ యాక్షన్ సినిమాలను చేస్తున్నారు.

అయితే, వీటిలో ఎన్‌బీకే 107 గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వచ్చి బ్లాస్ట్ అయింది. దాంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాను దసరా బరిలో దింపబోతున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే, త్వరలో అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ
బాలయ్య నటించబోతున్న 108 సినిమాను సెట్స్ మీదకు తీసుకురాబోతుండగా.. 2023 సంక్రాంతికే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం దర్శకుడు అనిల్ రావిపూడి పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగబోతున్నారు.

పూరి తర్వాత తెలుగులో సినిమాను కాస్త త్వరగా కంప్లీట్ చేసి విడుదల చేసే దర్శకుడు
అనిల్ రావిపూడి. నందమూరి హీరోలంటే ప్రత్యేకమైన అభిమానం. అందుకే, ఎట్టిపరిస్థితుల్లో బాలయ్య 108 వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చేలా ప్లాన్స్ చేస్తున్నారు. ఇక బాలయ్య తలుచుకుంటే ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేసినా షాకవ్వాల్సిన పనిలేదు. ఏదేమైనా రెండు పెద్ద పండ‌గ‌ల‌కు థియేట‌ర్ల‌లో జై బాల‌య్య గోల అయితే మామూలుగా ఉండ‌దు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news