టాలీవుడ్లో సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అలనాటి మేటి హీరోయిన్ విజయనిర్మల కుమారుడే నరేష్. విజయనిర్మలకు మొదటి భర్త సంతానం అయినా కూడా విజయనిర్మల – కృష్ణ దంపతుల గారాల పుత్రుడిగానే పెరిగి.. ఇండస్ట్రీలో పాతుకుపోయాడు. 1980 – 90వ దశకంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నరేష్ కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని హిట్ సినిమాలు చేసినా తర్వాత క్లిక్ కాలేదు.
ఇక ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి నాన్న,అంకుల్, మామ పాత్రల్లో ఫుల్ బిజీ అయిపోయాడు. నరేష్‌కు తల్లి విజయనిర్మల నుంచి వచ్చిన ఆస్తులే కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి. విజయనిర్మల బహుముఖ ప్రజ్ఞాశాలి. నిజం చెప్పాలంటే ఆమె కృష్ణ జీవితంలోకి వచ్చాకే ఆయన దశ తిరిగింది. ఆమె ఓ నటి మాత్రమే కాదు.. దర్శకురాలు.. కథకురాలు.. నిర్మాత. ఆమె డైరెక్ట్ చేసిన ఎన్నో సినిమాలు కృష్ణను తిరుగులేని సూపర్‌స్టార్‌ను చేశాయి.
విజయనిర్మల సంపాదించిన ఆస్తుల్లో చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో చాలా స్థిరచరాస్తులు ఉన్నాయి. విజయనిర్మల ఆస్తిపాస్తులకు నరేష్ ఏకైక వారసుడు కావడంతో ఇప్పుడు వాటి విలువ కొన్ని వేల కోట్లలోకే వెళ్లిపోయిందని అంటారు. నరేష్ మా ఎన్నికల్లో జరిగిన రచ్చతో బాగా హైలెట్ అయ్యాడు. నరేష్ సినిమాల పరంగా మంచి పేరే తెచ్చుకున్నా వ్యక్తిగత, వైవాహిక జీవితం పరంగా మాత్రం వార్తల్లో వ్యక్తిగా మారారు.
నరేష్‌కు విజయనిర్మల చిన్న వయస్సులోనూ రేఖ అనే అమ్మాయితో పెళ్లి చేశారు. ఈ దంపతులకు నవీన్ అనే కుమారుడు ఉన్నాడు. నవీన్ హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మన్పర్థలు రావడంతో రేఖకు దూరమైన ఒంటరిగా ఉన్న సమయంలో ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోన్న రమ్యతో పరిచయం ఏర్పడి ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు.
రమ్య ఏపీ మాజీ మంత్రి రఘువీరారెడ్డికి సోదరుడి కుమార్తె. ఈ పెళ్లికి ఆయన కూడా హాజరయ్యారు. అయితే రమ్యతో కూడా నరేష్‌కు గ్యాప్ రావడంతో వీరిద్దరు కూడా వేర్వేరుగానే ఉంటున్నారు. ఇక ఇటీవల రమ్య చీటింగ్ ఆరోపణలతో వార్తల్లోకి ఎక్కడంతో రమ్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని నరేష్ ఓ వీడియో కూడా వదిలారు. ఆమె తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తుందని కూడా నరేష్ ఆరోపించారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు నరేష్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన పవిత్రా లోకేష్‌ను ముచ్చటగా మూడో పెళ్లి చేసుకోబోతున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు యేడాదిన్నర నుంచి కలిసే తిరుగుతోన్నారు. కృష్ణ ఫ్యామిలీ ఇంట్లో ఏ కార్యక్రమాలు జరిగినా నరేష్‌తో కలిసే పవిత్రా లోకేష్ అటెండ్ అవుతున్న ఫొటోలు బయటకు వస్తున్నాయి. ఇక పవిత్రా లోకేష్ వయస్సు కూడా 45. నరేష్ రికమెండేషన్ వల్లే ఆమెకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయన్న ప్రచారం అయితే ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది.
పవిత్రకు గతంలోనే వివాహం జరిగింది. ఈ దంపతులకు పిల్లలు ఉన్నా కూడా మనస్పర్థలతో వీరు విడిపోయినట్టు చెపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు నరేష్‌తో కలిసి ఉంటోందట. మరి నరేష్ – పవిత్రా లోకేష్ నిజంగానే పెళ్లి చేసుకుంటారా ? లేదా తమ పెళ్లి వార్తలపై వస్తోన్న పుకార్లకు ఆన్సర్ చెప్పి చెక్ పెడతారా ? అన్నది చూడాలి.