Moviesఆ ఒక్క వీడియో ..సాయి పల్లవి జీవితానే మార్చేసింది..!!

ఆ ఒక్క వీడియో ..సాయి పల్లవి జీవితానే మార్చేసింది..!!

సాయి పల్లవి..ఇప్పుడు ఈ పేరుకు స్టార్ హీరోల కు మించిన క్రేజ్ ఉంది. పొట్టి బట్టలు వేసుకుంటేనే హీరోయిన్ కాదు ..చీరలో కనిపించి నటించి కూడా హీరోయిన్ గా ఎదగవచ్చు.. హీరోల సినిమాలే కాదు..హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ కూడా జనాలు ఆదరిస్తారు..అని ప్రూవ్ చేసిన నటి. కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న రోల్స్ నే చూస్ చేసుకుంటూ..కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న మలయాళం బ్యూటి.

సాయి పల్లవికి కి జనాల్లో ప్రిచ్చ క్రేజ్ ఉంది..దానికి కారణం చాలానే ఉన్నా..వాటిలో మోస్ట్ ఇంపార్ టేంట్ ది..మాత్రం ఆమె డ్రెస్సింగ్ స్టైల్. ఎక్కడికి వెళ్లిన పద్ధతిగా చీర కట్టుకుని వెళ్తుంది. అయితే, ఇదే విషయం గురించి ఆమె రీసెంట్ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ..సాయి పల్లవి తాను ఎందుకు పొట్టి బట్టలు వేసుకోను అనేదాని గురించి వివరణ ఇచ్చింది. దీంతో సాయి మాటలు నెట్టింట వైరల్ గా మారాయి

 

సాయి పల్లవి మాట్లాడుతూ..”డాక్టర్ కోర్స్ చదివేటప్పుడు..జార్జియా వెళ్ళను. అక్కడ ఫేమస్ టాంగ్ డ్యాన్స్ నేర్చుకున్న. ఒక్క ఈ వెంట్ లో అలా టాంగ్ డ్యాన్స్ చేయాల్సివచ్చింది. ఆ టైంలో ఆ సాంగ్ కి తగ్గట్లు స్లిట్ డ్రెస్ వేసుకున్నాను. నిజానికి మా అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు..నేనే బలవంతంగా ఒప్పించా. అయితే ఆ టైం లో ఆ వీడియో పెద్ద ఎవ్వరు పట్టించుకోలేదు. కానీ , ప్రేమమ్ సినిమా హిట్ అవ్వడంతో .. సినిమా తరువాత ..నా పాట డ్యాన్స్ వీడియో బయటకు వచ్చింది.

అస్సలు ఆ వీడియో ఎలా బయటకి వచ్చిందో కూడా తెలియదు. ఆ టైంలో కొందరు నన్ను దారుణంగా..ట్రోల్ చేశారు. మాట్లాడరాని మాటలు అన్నారు. అప్పుడే డిసైడ్ అయ్యాను ఇక పై అలాంటి డ్రెస్ లు వేసుకోకూడదు అని” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సాయి పల్లవి డ్యాన్స్ కు సంబంధించిన వీడియో తాలుకా ఫోటోలు మళ్లీ వైరల్ గా మారాయి. ఒకరి చేత ఒక్క మాట అనిపించుకోవడం ఇష్టం లేని సాయి పల్లవి..అప్పటి నుండి పొట్టి బట్టలు వేసుకోవడమే మానేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news