అతిలోక సుందరి శ్రీదేవితో ఉన్న ఈ ముగ్గురు పిల్లలు ఎవరో తెలుసా.. ఒకప్పటి స్టార్ హీరోయిన్లే..! అసలు ఈ ఫొటోలో ఉన్న పిల్లల్లో ఓ పిల్ల కాస్త పెద్దగా ఉంటే.. మరో ఇద్దరు చాలా చిన్నగా ఉన్నారు. వీరు ఏ హీరోయిన్లో కూడా మనం గుర్తు పట్టలేం. కానీ నాడు శ్రీదేవితో దిగిన ఈ ఫొటోలో ఉన్న ముగ్గురు కూడా స్టార్ హీరోయిన్లు అయ్యారు. హిట్ సినిమాలు చేశారు. పైగా ముగ్గురు సొంత అక్కా చెళ్లెల్లు కావడం కూడా మరో విశేషం. ఆ ముగ్గురు ఎవరో కాదు నగ్మా, జ్యోతిక, రాధిక ( తెరపేరు రోషిణి).
ఈ ముగ్గురు ఇప్పుడు వేర్వేరు జీవితాల్లో ఉన్నారు. నగ్మా ఐదు పదుల వయస్సుకు చేరువ అవుతున్నా కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. ఆమె సౌత్ సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. తెలుగులో స్టార్ హీరోలు అందరితోనూ కలిసి నటించింది. ఎన్నో ఊరమాస్ పాత్రలు చేసింది. అప్పట్లో నగ్మా అంటే అరేబియన్ గుర్రం అన్న పేరు ఉండేది. ఆమె నడక, ఆమె స్టైల్ ఓ రేంజ్లో ఉండేవి. కోలీవుడ్ సీనియర్ హీరో శరత్‌కుమార్‌తో ప్రేమాయణం నడిపింది.
తర్వాత భోజ్‌పురికి వెళ్లి అక్కడ మనోజ్ తివారి, రవికిషన్ సింగ్‌తోనూ కొన్నాళ్లు కథ నడిపింది. ( వీరిద్దరు ప్రస్తుతం బీజేపీ ఎంపీలుగా ఉన్నారు). ఆ తర్వాత భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సారవ్ గంగూలీతో ప్రేమాయణం నడిపింది. అప్పటికే గంగూలీకి డోనాతో పెళ్లయ్యిపోవడంతో ఈ ప్రేమ కూడా బ్రేకప్ అయ్యింది. ఇక ఆ తర్వాత ఆమె కాంగ్రెస్‌లో చేరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది. తనను రాజ్యసభకు పంపుతానని సోనియా హామీ ఇచ్చినా అది నెరవేర్చలేదంటూ వాపోయింది. ఏదేమైనా నగ్మా వైవాహిక జీవితానికి ఊరంగా ఉన్నా సాధించింది ఏమీ లేదు.
ఇక మరో సోదరి జ్యోతిక. ఒకప్పటి హీరోయిన్. పైగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పిల్లలు పుట్టాక కూడా సినిమాలు చేస్తోంది. కావాల్సినంత కీర్తి, డబ్బుతో పాటు తను ఓ అందమైన జీవితం క్రియేట్ చేసుకుంది. అన్నింటా అండగా నిలబడే భర్త దొరకడం ఆమె అదృష్టం. ఇక తుమ్మితే ఊడిపోయే సినిమా జీవితంలో తన బంధాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది.
ఇక మరో సోదరి రాధిక ( సినిమాల్లో రోషిణి). కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని సినిమాలు చేసింది. మెగాస్టార్ చిరంజీవి మాస్టర్ సినిమాలో నటించింది. ఓ ఎన్నారైను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లి అక్కడ సెటిల్ అయిపోయింది. తర్వాత మళ్లీ ఆమె సినిమాల్లోకి రాలేదు. ఆమె జీవితం.. పిల్లలు, భర్తతో హ్యాపీగా సాగుతోంది. ఇలా శ్రీదేవి పక్కన ఉన్న ఈ ముగ్గురు తర్వాత హీరోయిన్లుగా ఓ వెలుగు వెలుగుతారని అప్పట్లో ఎవ్వరూ ఊహించి ఉండరు. ఇప్పుడు ఈ ఫొటో నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది.