నంద్యాల ఉప ఎన్నికలు కురుక్షేత్రం స్థాయిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రధాన పోటీదారులుగా ఉన్న టీడీపీ మరియి వైసీపీ లు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలటం లేదు. తమకున్న శక్తీ యుక్తులన్నింటిని ప్రదర్శిస్తున్నాయి. దీని ఫలితం వల్ల ఇప్పటికిప్పుడు ఇటు జనాలకి గాని అటు పార్టీలకి గాని ఎటువంటి లాభం లేదు.. కానీ రెండు పార్టీలు ప్రెస్టేజ్ కింద తీసికొని ఎవరికీ వారు గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఇక ఇటువంటి హోరాహోరీ ప్రచార సమయంలో మన బిత్తిరి సత్తి రిపోర్టింగ్ ఇవ్వటానికి నంద్యాల పోయిండు. ఇక చూడండి…మన సత్తి అన్న రిపోర్టింగ్ ఎలా ఉందో…