ప్రముఖ OTT సంస్ధ ఆహా సరికొత్త కంటెంట్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రోజు రోజు కి పెరిగిపోతున్న సబ్ స్క్రైబర్లకు ఆనందానిచ్చే విధంగా ఆహా సంస్ధ ముందుకెళ్తుంది. దీనంతటికి కారణం బాలయ్య అని చెప్పక తప్పదు. బాలకృష్ణ అన్ స్టాపబుల్ తరువాతే, ఈ రేంజ్ రెస్పాన్ వస్తుంది ఆహాకి. ఆ తరువాతే ఢిఫరెంట్ కంటెంట్ తో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు తెలుగు టాప్ OTT ఆహానే.
అయితే, ఇంత పెద్ద పేరున్న, గొప్ప సంస్ధ..పైగా అల్లు అరవింద్ కి బావ ..మరీ అలాంటి ఆయన ఆహా కి వస్తే ఎంత బాగా చూసుకోవాలి. రీసెంట్ గా ఇండియన్ ఐడల్ తెలుగు ఫినాలే ఎపిసోడ్ కంప్లీట్ చేసుకున్నారు. వచ్చే శుక్రవారం ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ఇప్పటికే ఈ షోకి గెస్ట్ గా చిరంజీవి వస్తున్నారు అని చెప్పేశారు టీం. అయితే, తాగాజా దీనికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.
కాగా, ఈ షోకి సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ షో హోస్ట్.. చిరంజీవిని పరోక్షంగా అవమానించే మాటలు మాట్లాడిన్నట్లు టాక్ వినిపిస్తుంది. పోరపాటున హోస్ట్ చిరంజీవి మనసు బాధ పెట్టాడని.. మళ్ళీ టీం వాళ్లు అర్ధం చేసుకుని ..ఆ సీన్ ని కట్ చేసి..రీస్ హూట్ చేశాడని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అంతే కాదు అప్పటికే ట్రోఫీ ఇచ్చిన చిరంజీవి..సెట్ నుండి వెళ్లిపోయాడట. ఇన్ సైడ్ వర్గాల నుండి న్యూస్ బయటకు రావడంతో వైరల్ మారింది. మరి దీని పై నిజా నిజాలు తెలియాల్సి ఉంది.