కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార..ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. ఎంతో మంది బాయ్ ఫ్రెండ్స్ ని మార్చిన ఈ అమ్మడు..ఫైనల్లీ తాను ప్రేమించిన కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ నే పెళ్ళి చేసుకుంది. గత ఆరేళ్ళుగా లవ్ లో మునిగితేలుతున్న ఈ జంట..జూన్ 9 తమిళనాడు లోని మహాబలిపురంలో ఓ రిసార్ట్లో వీరి పెళ్లి హై సెక్యూరిటీ నడుమ చాలా సింపుల్ గా జరుగుతుంది. పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆహ్వానితులు ఈ పెళ్లికి వచ్చి వధువరులను ఆశీర్వదించారు. ఇప్పటికే నయన్-విగ్నేశ్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఎర్రటి చీరలో నయన్ అలా నడిచి వస్తుంటే..అచ్చం దివి నుంచి భువికి వచ్చిన దేవకన్యలా అనిపించింది. ఇక ఫైనల్లీ విగ్నేశ్ నయన్ మెడలో మూడు మూళ్లు వేసి..ఆమె ను తన భార్యగా చేసుకున్నాడు. ఎన్నో ఏళ్ళ నుండి ఈ క్షణం కోసం ఎదురుచూసిన విగ్నేశ్..ఆమె నుదటి పై ప్రేమగా ముద్దాడాడు. దీంతో వీళ్ల పెళ్ళి ఫోటోలు నెటింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, వంటి తదితరులు ఈ వివాహానికి హాజరైనట్లు తెలుస్తోంది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖులు ఎవ్వరు నయనతార వివాహానికి హాజరైనట్లు లేరు.
కాగా, పెళ్ళైన మరుసటి రోజే నయన్ కొత్త చిక్కుల్లో చిక్కుకుంది. హిందులువులు ఎంతో ఇష్టం గా కొలుచుకునే ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామీ..గుడికి వెళ్ళారు ఈ జంట . తిరుమల లో శీవారిని శ్రీవారిని దర్శించుకున్నారు నయన్-విగ్న్రశ్. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయాధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి.. శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.కాగా, కొంత సేపు అక్కడ సందడి వాతావరణం నెలకోంది. ఎలాంటి హంగామా లేకుండా..చాలా సింపుల్ గా కనిపించిన ఈ జంట..బాగుంది అనుకునేలోపే..నయన్ చేసిన పని బయట పట్టి జనాల చేత తిట్టించుకుంటుంది. నయన్ శ్రీవారి సన్నిధిలో చెప్పులు వేసుకుని తిరిగింది. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో ఇది అపవిత్రం అంటూ అమ్మడుని తిట్టిపోస్తున్నారు జనాలు.