Moviesపెళ్లిలో నయన్ పట్టు చీర కట్టుకోకపోవడానికి రీజన్ తెలిస్తే..ఆశ్చర్యపోవాల్సిందే..?

పెళ్లిలో నయన్ పట్టు చీర కట్టుకోకపోవడానికి రీజన్ తెలిస్తే..ఆశ్చర్యపోవాల్సిందే..?

హమ్మయ్య..అయిపోయింది..ఎట్టకేలకు కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయన తార..డైరెక్టర్ విగ్నేశ్ శివన్ పెళ్లి జరిగిపోయింది. ఇన్నాళ్లు లవ్ బార్డ్స్ గా ఉన్న వీళ్లు ఇప్పుడు ఆఫిషియల్ భార్య భర్తలుగా మారిపోయారు. దీంతో కోలీవుడ్, టాలీవుడ్, మలయాళం నుండి నయన తారను అభిమానించే ప్రజాలు సెలబ్రిటీలు..ఆమెకు విషెష్ చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఆమె తమతో కలిసి వర్క్ చేసిన ఫోటోలను షేర్ చేస్తూ..హ్యాపీ మ్యారిడ్ లైఫ్ అంటూ చెప్పుకొచ్చారు.

కాగా, మహాబలిపూరంలోని ఓ రిసార్ట్‌లో తెల్లవారు జామున 2.22 గంటలకు నయన్‌-విఘ్నేశ్‌లు ఏడడుగులు వేశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా ఈ పెళ్లికి అతి తక్కువ మంది సెలబ్రిటీలే హాజరైన్నట్లు తెలుస్తుంది. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌లు పెళ్లికి హజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే, కొద్ది సేపటి క్రితమే విగ్నేశ్..తాను నయన్ మెడలో మూడు ముళ్ళు వేసిన సంధర్భానికి సంబంధించి కొన్ని ఫోటోలని అభిమానులతో పంచుకున్నాడు.

దీంతో నయనతార పెళ్ళి ఫోటోలు నెట్టింట కొద్ది నిమిషాల్లోనే వైరల్ గా మారిపోయాయి . అయితే, జనరల్ గా పెళ్ళి అంటే..ఎవ్వరైన పట్టు చీరను కట్టుకోవడం ట్రెడీషన్. పైగా తమిళియన్లు ఇంకా ఎక్కువ గా ఆ సాంప్రదాయాని ఫాలో అవుతారు. కానీ, నయన మాత్రం డిజైనర్ వేర్ రెడ్ కలర్ శారీ కట్టుకుని..దానికి మ్యాచింగ్ జ్యూవేలరీ వేసి..స్పేషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

అయితే, నయన్ పెళ్ళిలో పట్టు చీర కట్టుకోపోవడానికి రీజన్ మాత్రం విగ్నేశ్ నే కారణం అంటూ ఓ వార్త కోలీవుడ్ మీడియా వైరల్ అవుతుంది. విగ్నేశ్ వాళ్ల ఆచారం ప్రకారం..వాళ్ళ ఇంటికి కాబోయే కోడలు పెళ్ళి పీఠల పై రెడ్ కలర్ చీర తోనే కూర్చో వాలట. అయితే, నయన్ అందరిలా పట్టు చీర కాకుండా సరికొత్త ట్రెండ్ సృష్టిస్తూ..డిజైనర్ వేర్ చీరను ధరించింది. ఏ మాటకు ఆ మాట పెళ్ళి కూతురు గెటప్ లో నయన్ బొమ్మల ఉంది. దీంతో ఇద్దరి జంట చూడ ముచ్చటగా ఉంది అంటూ..అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news