మనిషి జీవితంలో పుట్టుక, చావుకు మధ్యలో వివాహం అనేది అతిముఖ్యమైన ఘట్టం. ఈ వివాహం ద్వారా మనిషి మరో సరికొత్త జీవితం ఆరంభిస్తాడు. ఈ వివాహంతోనే తనకంటూ సమాజంలో ఓ కుటుంబం ఏర్పడుతుంది. ప్రతి మనిషి జీవితాన్ని పెళ్లికి ముందు ఘట్టం. పెళ్లి తర్వాత ఘట్టం అని విభజించవచ్చు. పెళ్లికి ముందు మన జీవితంలో స్నేహితులు, తల్లిదండ్రులు కీలకంగా ఉంటారు. పెళ్లి తర్వాత మాత్రం జీవిత భాగస్వామే ముఖ్యం. ఆ తర్వాత పుట్టిన పిల్లలు మనిషి జీవితంలో కీలక పాత్ర పోషిస్తారు.
పురుషుడు అయినా స్త్రీ అయినా కూడా పెళ్లికి ముందు వరకు వారి జీవితంలో, వారి ఎదుగుదలలో తల్లిదండ్రులదే కీలక పాత్ర. ఆ తర్వాత వారికి భర్తే సర్వస్వం అవుతాడు. అయితే తాజాగా ఓ అధ్యయనం ఎలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలి.. ఎలాంటి అమ్మాయితో పెళ్లి జరిగితే ఇబ్బందులు తప్పవు అనే విషయాలపై ఓ నివేదిక వెల్లడించింది.
పురుషుడు వివాహం చేసుకునేటప్పుడు ఆస్తి కోసం ఆరాట పడకూడదట. తనకు వచ్చే భార్య ఎక్కువ కట్నం తేవాలనుకోవడం.. అత్తింటి నుంచి ఎక్కువ కోరుకుంటే అతడు తర్వాత మాట పట్టింపు వచ్చినప్పుడు అత్తింటి వాళ్లు గట్టిగా మాట్లాడితే తలదించుకునే పరిస్థితులు కూడా తలెత్తుతాయట. పురుషుడు ఎంత వరకు తమకంటే తక్కువ ఆస్తి ఉన్న కుటుంబం నుంచి అమ్మాయిని మాత్రమే భార్యగా స్వీకరిస్తేనే అతడి జీవితం ప్రశాంతంగా ఉంటుందట.
తమ కుటుంబం కంటే తక్కువ ఆస్తి ఉన్న అమ్మాయిని భార్యగా స్వీకరిస్తే సమాజంలో అతడికి మరింత గౌరవం పెరగడంతో పాటు అత్తింటి వాళ్లు, ఆ బంధువుల దగ్గర ఉన్నతంగా ఉండడంతో పాటు తన భార్యకు ముందు జీవితం కంటే మంచి జీవితం ఇచ్చినవాడు అవుతాడట. ఇక తమ కుటుంబంలో కలిసిపోయే అమ్మాయినే పెళ్లి చేసుకోవడం మంచిదట. అలా పెళ్లి చేసుకుంటే పెళ్లి తర్వాత గొడవలు రాకుండా ఉండడంతో పాటు చిన్న చిన్న సమస్యలు వచ్చినా సర్దుకుపోతారట.
ఇక అబ్బాయి మనస్తత్వంతో పాటు అతడి ఉద్యోగం, ఆస్తిని మాత్రమే చూసి పెళ్లికి ఒప్పుకునే అమ్మాయిలకు దూరంగా ఉండాలట. అలాంటి వారిని చేసుకుంటే భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు తప్పవని తాజా అధ్యయనం చెపుతోంది. ఇక తమ ఇంట్లోకి వచ్చే అమ్మాయి అత్త, మామలను తన తల్లిదండ్రులతో సమానంగా గౌరవించేలా ఉండాలట. అలాంటి అమ్మాయి అయితే కుటుంబంలో సమస్యలు, అపార్థాలు పెద్దగా రావు అట.