MoviesRC 15 కు బిగ్ షాక్: చరణ్ సినిమా నుండే అలిగి...

RC 15 కు బిగ్ షాక్: చరణ్ సినిమా నుండే అలిగి వెళ్లిపోయారా..ఘోర అవమానం..?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్..RRR లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తన ఖాతాలో వేసుకున్నాక..ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న చిత్రం RC 15. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుండటం ఓ ప్రత్యేకత అయితే..తెలుగు లో డైరెక్ట్ గా తీస్తున్న ఫస్ట్ సినిమా ఇదే కావడం మరింత స్పెషల్ గా మారింది. ఈ సినిమా లో చరణ్..తన కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా మూడు పాత్రల్లో కనిపించబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమాలో తెలుగు ముద్దుగుమ్మ అంజలి..చరణ్ తో రొమాన్స్ చేస్తుంది. ఇక బాలీవుడ్ హాట్ బ్యూటీ కియరా..చరణ్ ఫ్లాష్ బ్యాక్ లో కనిపిస్తుందన్న టాక్ వినిపిస్తుంది. అయితే, ఈ సినిమాలో మూడో హీరోయిన్ కూడా ఉందని..ఆ రోల్ కోస్మ రష్మికను సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది. అది జర్నలిస్ట్ రోల్ అంటూ ఓ టాక్ బయటకి వచ్చింది. అంతేకాదు, ఈ సినిమా లో శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, ‘వెన్నెల’ కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పతాకంపై ‘దిల్‌’ రాజు, శిరీశ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ కాంబోకి బ్లాక్ బస్టర్ తమన్ సంగీతం అందిస్తుండటం గమనార్హం.

అయితే, అంత సజావుగా జరిగిపోతుందని అనుకునే టైంలో బిగ్ ప్రాబ్లమ్ వచ్చింది. ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్న రామకృష్ణ-మౌనిక ..సినిమానుండి బయటకు వచ్చేసిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. సినిమా కోసం భారీ సెట్ నిర్మించే క్రమంలోనే డైరెక్టర్ శంకర్ కి..రామకృష్ణ-మౌనిక ల మధ్య ఏదో గొడవ అయ్యిన్నట్లు..శంకర్ తన మాటలతో అవమానించిన్నట్లు ..ఈ క్రమంలోనే అలిగి రామకృష్ణ-మౌనిక సెట్స్ నుండి వెళ్లిపోయిన్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇక ఏమాత్రం ఆలస్యం చేయని శంకర్ వెంటనే ఆయన ప్లేస్ లో కి ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ని తీసుకున్నారని తెలుస్తుంది. రవీందర్ ఇటివలే ‘రాధే శ్యామ్’ కి వర్క్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా లో ఆయన్ టాలెంట్ కి మంచి మార్కులే పడ్డాయి. గతంలో ఆయ్న చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ‘మగధీర’ కి అదిరిపోయే సెట్స్ వేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అని ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. సుమారు 50 శాతం సినిమా కంప్లీట్ అయ్యాక.. ఈ తరుణంలో ప్రొడక్షన్ డిజైనర్ మార్పు అనేది ఇండస్ట్రీలో చాలా మందికి షాకింగ్ గా ఉంది. అంత పెద్ద డైరెక్టర్..అందులోను టాప్ హీరో..ఏదో పెద్ద గొడవ అయ్యి ఉంటుందని అంతా భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news