నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి సినిమా ఉంటుంది. ఇది బాలయ్య కెరీర్లో 108వ సినిమా అవుతుంది. ఈ సినిమా కథ గురించి కూడా ఎఫ్ 3 ప్రమోషన్లలో అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశాడు. 50 ఏళ్ల వయస్సు ఉన్న ఓ మధ్య వయస్సు వ్యక్తి స్టోరీయే ఈ సినిమా అని అనిల్ చెప్పాడు. శ్రీలీల బాలయ్య కుమార్తె రోల్లో చేస్తుందని కూడా అనిల్ చెప్పేశాడు.
తాజాగా ఎఫ్ 3 లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌తో ఫుల్ ఫామ్‌లో ఉండడంతో పాటు డబుల్ హ్యాట్రిక్ హిట్లు కొట్టిన అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమా బాలయ్యతో అన్న వెంటనే బాలయ్య అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అయిపోయారు. ఇప్పటి వరకు ఎవ్వరూ బాలయ్యను చూపించని రోల్లో చూపించబోతున్నానని కూడా అనిల్ చెప్పకనే చెప్పేశాడు. అయితే ఈ రెండు సినిమాల తర్వాత బాలయ్య లైనప్‌లో బోయపాటి శ్రీను, పూరి జగన్నాథ్ ఉన్నారు.
అయితే సెడన్‌గా మరో యంగ్ డైరెక్టర్ పేరు ఈ లైనప్‌లో దూరేసింది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు బీవీఎస్. రవి. రవి మంచి రచయిత.. ఆయనకు రచయితగా చాలా హిట్లే ఉన్నాయి. అయితే దర్శకుడిగా ఆయన తీసిన వాంటెడ్, జవాన్ రెండు సినిమాలు మంచి సినిమాలుగా పేరున్నా కమర్షియల్‌గా ప్లాప్ అయ్యాయి. అయితే బాలయ్య హోస్ట్ చేసిన టాక్ షో అన్‌స్టాపబుల్ షోను రవియే స్వయంగా డిజైన్ చేశారు.
ఈ షో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఈ పరిచయంతోనే బాలయ్య రవికి అనిల్ సినిమా తర్వాత ఛాన్స్ ఇచ్చాడన్న ప్రచారం అయితే ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది. రచయితగా రవిని మనం ఎప్పుడూ తప్పు పట్టలేం. మంచి లైన్లు తీసుకుంటాడు. అందులో డెప్త్ ఉంటుంది. అయితే డైరెక్టర్ రెండు సినిమాలు తీసినా అవి ప్రేక్షకులను మెప్పించలేదు. అయితే రవి సినిమాలకు యాక్షన్ స్కోప్ ఎక్కువ.
ఆ టైన్ స్టోరీలు బాలయ్యకు బాగా యాప్ట్ అవుతాయి. మరి ఏ ధైర్యంతో బాలయ్య రవికి ఛాన్స్ ఇచ్చాడు అన్నది చూడాలి. ఏదేమైనా బీవీఎస్ రవితో బాలయ్య సినిమా ఉంటే అది ఊహించని ట్విస్టే అవుతుంది.