అఖండ గర్జన మోగించాక నందమూరి నటసింహం బాలకృష్ణ జోరుమీదున్నాడు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ దర్శకత్వలో తన 107వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీస్ వాళ్లు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. శృతీహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా వరలక్ష్మి శరత్‌కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ లాంటి వాళ్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క్రాక్ సినిమా తర్వాత గోపీచంద్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఇదే.
బాలయ్యకు ప్లాపుల తర్వాత అఖండ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ దక్కింది. ఈ హిట్ ట్రాక్‌ను కంటిన్యూ చేస్తూ బాలయ్య వరుసగా సక్సెస్‌ల్లో ఉన్న దర్శకులతోనే సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. క్రాక్ జోష్‌లో ఉన్న మలినేని గోపీ డైరెక్షన్లో సినిమా చేస్తోన్న బాలయ్య ఆ తర్వాత అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, పూరి జగన్నాథ్ లాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్లనే లైన్లో పెట్టుకున్నాడు.
ఇక మలినేని గోపీ సినిమా ఎప్పుడు వస్తుందా ? అని బాలయ్య అభిమానులు కళ్లుకాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి బాలయ్య ఫ్యాన్స్ ఫ్యీజులు ఎగిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ 40 శాతం పూర్తయిపోయిందట. ఇప్పటికే ఓ పాటతో పాటు మూడు యాక్షన్ సీక్వెన్స్ కూడా దర్శకుడు షూట్ చేసినట్టు టాక్ ?
ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌తో బాలయ్య రక్తంతో నిండిన కత్తి పట్టుకుని ఉగ్ర నరసింహుడిగా కనిపిస్తున్నాడు. బాలయ్య సినిమాల్లో టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో ఫైట్ ఉంటే సినిమా సూపర్ హిట్ అవ్వడం సెంటిమెంట్‌గా ఉంది. మరి ఈ సెంటిమెంట్ రిపీట్ అయ్యి మరి ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందనే అంటున్నారు.
ఇక జై బాలయ్యా అనే క్యాచీ టైటిల్ ఈ సినిమాకు పరిశీలిస్తున్నారు. చివరకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే వచ్చే దసరా బరిలోనే ఈ సినిమాను బాక్సాఫీస్ బరిలోకి దింపనున్నారు. బాలయ్య అభిమానులకు దసరా పండగ మామూలు పండగ కాదు డబుల్ పెస్టివల్ కానుంది.