టాలీవుడ్లో అక్కినేని ఫ్యామిలీ నుంచి ఏఎన్నార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. సీనియర్ నటుడిగా ఉన్న నాగార్జున తన ఇద్దరు కుమారులు హీరోలు అయినా కూడా తాను కూడా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. నాగార్జున వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ముందుగా దివంగత లెజెండ్రీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె శ్రీలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారి మధ్య మనస్పర్థలు రావడంతో నాగచైతన్య పుట్టాక విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత తన తోటి హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు అఖిల్ జన్మించాడు. ఇక శ్రీలక్ష్మితో విడాకుల తర్వాత నాగార్జున లవ్ స్టోరీలతో సినిమాలు చేసుకుంటూ అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎదిగాడు. ఇక నాగార్జున – అమల ప్రేమలో ముందుగా ప్రపోజ్ చేసింది ఎవరు ? వీళ్లిద్దరు ఎలా ప్రేమలో పడ్డారు ? ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు ? అన్న ప్రశ్నలకు చాలా రోజుల తర్వాత ఆన్సర్ దొరికింది.
అమలకు కజిన్ బ్రదర్ అయిన సురేష్ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు. అసలు ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పే ధైర్యం కూడా ఎవ్వరికి లేదు. అయితే సురేష్ చక్రవర్తి ఈ సీక్రెట్ చెప్పేశాడు. తాను అమలకు సొంత తమ్ముడిని కాకపోయినా తనను ఆమె తోబుట్టువుగానే చూసుకున్నారని తెలిపాడు. అమలు , తాను ఎంతో స్నేహంగా ఉన్నా ఎప్పుడూ వ్యక్తిగత విషయాలు గురించి ప్రస్తావించుకోలేదని కూడా చెప్పాడు.
ఇక పెళ్లికి ముందు అందరిలాగానే నాగార్జున – అమలకు ఏదో ఉందన్న విషయం అందరిలాగానే తనకు కూడా తెలుసు అని.. అయితే తనకు తెలిసిన సమాచారం ప్రకారం ముందుగా నాగార్జునే అమలకు ప్రపోజ్ చేశాడని ఆయన తెలిపారు. ఈ విషయాలను సురేష్ చక్రవర్తి బయట పెడుతూనే సారీ నాగ్ తప్పుంటే క్షమించు అని తెలియజేశాడు. సురేష్ చెప్పిన దానిని బట్టి చూస్తే ముందు నాగే అమలకు ప్రపోజ్ చేసినట్టు తెలుస్తోంది.