Moviesటాలీవుడ్ స్టార్ హీరోల‌కు రెమ్యున‌రేష‌న్ల గండం.. దిమ్మ‌తిరిగి బొమ్మ క‌న‌ప‌డే షాక్‌..!

టాలీవుడ్ స్టార్ హీరోల‌కు రెమ్యున‌రేష‌న్ల గండం.. దిమ్మ‌తిరిగి బొమ్మ క‌న‌ప‌డే షాక్‌..!

టాలీవుడ్‌లో కోవిడ్ అనంత‌రం సినిమాల జోరు పెరిగింది. రెండేళ్ల నుంచి ఖాళీగా ఉన్న స్టార్ హీరోలు సైతం వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే వీళ్లు భారీగా రెమ్యున‌రేష‌న్లు పెంచేస్తున్నారు. కానీ వ‌సూళ్ల ట్రెండ్ చూస్తుంటే ఈ రెమ్యున‌రేష‌న్ల‌కు ఇప్పుడు భారీగా కోత ప‌డే ఛాన్సులు క‌నిపిస్తున్నాయి.

పెద్ద హీరోల సినిమాల నైజాం, ఆంధ్రా క‌లెక్ష‌న్లు చూస్తుంటే రెమ్యున‌రేష‌న్ల కోత‌లు త‌ప్పేలా లేవు. ఉదాహ‌ర‌ణ‌కు కోవిడ్ త‌ర్వాత నైజాం మార్కెట్ లెక్క‌లు చూస్తే అస్సలు ఎవ్వ‌రికి అంతు దొర‌క‌డం లేదు. కోవిడ్ త‌ర్వాత సినిమాలు ఎంత పెద్ద హిట్ అయినా ఏ సినిమా కూడా ( త్రిబుల్ ఆర్ మిన‌హా) రు. 36 కోట్ల మార్క్ ట‌చ్ చేయ‌లేదు. కోవిడ్‌కు ముందు అల వైకుంఠ‌పురంలో సినిమా మాత్ర‌మే రు. 42 కోట్లు రాబ‌ట్టింది. ఇక బాహుబ‌లి సీరిస్‌ను ఇందుకు మిన‌హాయించాలి.

 

ఇక కోవిడ్ త‌ర్వాత అఖండ‌, భీమ్లానాయ‌క్‌, స‌ర్కారు వారి పాట ఇలా ఏ సినిమా కూడా రు. 30 కోట్ల మార్క్ దాట‌లేదు. ఆచార్య మ‌రీ ఘోరంగా రు. 12 కోట్ల ద‌గ్గ‌రే ఆగిపోయింది. అంటే హిట్ అంటే రు. 36 కోట్ల కంటే త‌క్కువ‌.. ఇంకా చెప్పాలంటే రు. 30 కోట్ల రేంజ్‌లో స‌రిపెట్టుకోవాలి. ఇక ఇప్పుడు మ‌హేష్ – త్రివిక్ర‌మ్ సినిమా వస్తుంది. ఈ సినిమాను నైజాంలో అల వైకుంఠ‌పురంలో వ‌సూలు చేసిన రు. 42 కోట్ల ఫిగ‌ర్ చూపించి.. ఆ స్థాయిలో అమ్మేంత సీన్ లేదు.

ఎందుకంటే ఇప్పుడు ఇక్క‌డ రేట్లు పెరిగిపోయాయి. రిపీటెడ్ ఆడియెన్స్ రావ‌డం లేదు. ఎంత పెద్ద హిట్ సినిమాకు అయినా రు. 36 కోట్లు రాన‌ప్పుడు ఇంకా రు. 42 కోట్ల‌కు ఎలా అమ్ముతారు. ఇక ఏపీలో అన్ని పెద్ద సినిమాల‌ను రు. 50 కోట్ల రేంజ్‌లో అమ్మేస్తున్నారు. అయితే పుష్ప‌తో స‌హా ఏ సినిమా కూడా అక్క‌డ బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు నానా క‌ష్టాలు ప‌డాల్సి వ‌స్తోంది. అఖండ‌ను మాత్రం త‌క్కువ రేట్ల‌కు అమ్మ‌డంతో భారీ లాభాలు వ‌చ్చాయి.

ఆంధ్రాలో ప్ర‌తి పెద్ద సినిమాకు రు. 50 కోట్లు కావాల‌ని నిర్మాతలు ప‌ట్టుబ‌డుతున్నారు. ఇదే ప‌రిస్థితి కంటిన్యూ అయితే అక్క‌డ కొద్ది రోజుల‌కు బయ్య‌ర్లు అనేవాడు మాయం అయ్యే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు. ఆంధ్రా, నైజాం అమ్మ‌కాలు త‌గ్గిపోయి.. నిర్మాత‌ల‌కు రు. 10 – 15 కోట్ల అమౌంట్ తగ్గితే.. ఇప్పుడు ఆ న‌ష్టాన్ని ఎక్క‌డ ? నుంచి భ‌ర్తీ చేయాల‌న్న ప్ర‌శ్న స‌హ‌జంగానే వ‌స్తుంది.

రాను రాను ప్రొడ‌క్ష‌న్ ఖ‌ర్చు పెరుగుతోంది. హీరోల రెమ్యున‌రేష‌న్లు పెరుగుతున్నాయి. ఇక్కడ థియేట‌ర్ల నుంచి అమౌంట్ రాన‌ప్పుడు ఇక హీరోలే త‌మ రెమ్యున‌రేష‌న్లు త‌గ్గించుకోవాల్సిన ప‌రిస్థితి. ఎంత‌కాలం అని న‌ష్టాల‌తో నిర్మాత‌లు మాత్రం సినిమాలు తీస్తారు.. ఎప్పుడు అయితే ప్రేక్ష‌కుడు పెరిగిన రేట్ల‌తో థియేట‌ర్ల వైపు చూడ‌డం మానేస్తారో ? అప్పుడు హీరోలు కింద‌కు దిగిరాక త‌ప్ప‌దు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news