Moviesడిస్ట్రిబ్యూటర్లకు అండగా హీరోస్

డిస్ట్రిబ్యూటర్లకు అండగా హీరోస్

భారీ అంచనాలతో విడుదలైన సినిమాలు ప్రేక్షకుల నిరాదరణతో పరాజయం పాలైతే, సదరు చిత్రాలకు సంబంధించిన హీరోలు తమ రెమ్యూనరేషన్‌లో కొంత భాగాన్ని నష్టపోయిన నిర్మాతలకు, పంపిణీదారులకు ఇవ్వడమనేది తెలుగునాట తరచూ చూస్తూనే ఉన్నాం. ఇలాంటివి బాలీవుడ్‌లోనూ వింటూనే ఉన్నాం. తాజాగా ఇదే బాటలో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ కూడా కొంత డబ్బు వెనక్కి ఇవ్వబోతున్నారు.

కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో ఆయన నటించిన ‘ట్యూబ్‌లైట్‌’ చిత్రం బాక్సాఫీసు వద్ద డీలా పడింది. ఈ చిత్రానికి సల్మానే నిర్మాత. సినిమా పరాజయం చెందడంతో ముందుగా చెప్పినట్టే డిస్ట్రిబ్యూటర్లకు 35 కోట్ల రూపాయల్ని సల్మాన్‌ తిరిగి ఇస్తున్నారు.

ప్రస్తుతం ‘టైగర్‌ జిందా హై’ చిత్రీకరణ నిమిత్తం మొరాకోలో ఉన్న సల్మాన్‌ ఇండియాకి రాగానే ఆ డబ్బును డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. మరో విశేషమేంటంటే ‘ట్యూబ్‌లైట్‌’ చిత్రం వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లే షారూఖ్‌ నటించిన ‘జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌’ చిత్రం కారణంగా కూడా నష్టపోయారు. వీరికి కూడా షారూఖ్‌ డబ్బు తిరిగి ఇచ్చేయనున్నట్టు బాలీవుడ్‌ వర్గాలు తెలిపాయి

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news