ప్రేమకథల స్పెషలిస్ట్ గా తన మార్క్ చూపిస్తూ వచ్చిన తేజ హోరా హోరి తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా నేనే రాజు నేనే మంత్రి. బాహుబలి భళ్లాళుడి గా రానా సంపాదించిన క్రేజ్ తో వస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.
కథ విషయానికొస్తే.. అనంతపూర్ కేంద్ర ఖర్మాగారంలో ఉరి వేసుకుంటాడు జోగేంద్ర (రానా).తన చివరి కోరికగా తన జీవితమంతా టివిలో టెలికాస్ట్ చేయమంటాడు. అక్కడే అసలు కథ మొదలవుతుంది. కుటుంబంతో సరదాగా ఉంటున్న జోగేంద్ర అన్ని ఎమోషన్స్ కలిగి ఉంటాడు. ఊళ్లో జరిగిన ఓ చిన్న గొడవ వల్ల జోగేంద్ర పొలిటిషియన్ అవ్వాలనుకుంటాడు. ఇక మొదట సర్పంచ్ ఆ తర్వాత ఆ తర్వాత ఎలా తన పొలిటికల్ బ్రెయిన్ ఉపయోగించి ఎదిగాడు అన్నది కథ. టివి రిపోర్టర్ దేవిక రాణిగా కేథరిన్ త్రెసా కనిపిస్తుంది. రాధగా కాజల్ జోగేంద్ర భార్యగా అలరిస్తుంది.
ఇక రానా పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ఎలాంటి పాత్రకైనా సరే ది బెస్ట్ అవుట్ పుట్ ఇస్తాడని తెలిసిందే. జోగేంద్రగా రానా అద్భుత నటన కనబరిచాడు. ఇక రాధగా కాజల్ మరోసారి తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. సినిమాలో రానా, కాజల్ రొమాంటిక్ సీన్స్ కూడా బాగుంటాయి. నవదీప్ పాత్ర ఆకట్టుకుంటుంది.
తేజ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా మొదటి భాగం అదరగొట్టింది. ముఖ్యంగా మొదటి 45 నిమిషాలు సినిమా పీక్స్ అని చెప్పొచ్చు. అయితే సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ ఎక్కువవడం వల్ల ఆడియెన్స్ సహనానికి పరిక్ష పెట్టినట్టు అవుతుంది. ఇక అదే క్రమంలో వచ్చిన క్లైమాక్స్ కూడా నిరాశ పరుస్తుంది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్ చేసినట్టుగా సెకండ్ హాఫ్ అలరించలేదు.
టెక్నికల్ విషయానికొస్తే.. దర్శకుడు తేజ తనకు వచ్చిన అవకాశాన్ని వాడుకున్నట్టుగా అనిపించినా ఇంకాస్త స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. కథనంలో కూడా సెకండ్ హాఫ్ ల్యాంగ్ అయినట్టు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ఈమధ్య కాలంలో అనూప్ ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ కాస్త ట్రిం చేసి ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్.
ప్లస్ పాయింట్స్ :
రానా నటన
ఫస్ట్ హాఫ్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్
క్లైమాక్స్
బాటం లైన్ : జోగేంద్ర అలరించాడు కాని..!
రేటింగ్ : 3/5