Moviesఎన్టీఆర్‌ ' సింహాద్రి ' సినిమాకు క‌మ‌ల్‌హాస‌న్ సినిమా స్ఫూర్తి... తెర‌వెన‌క...

ఎన్టీఆర్‌ ‘ సింహాద్రి ‘ సినిమాకు క‌మ‌ల్‌హాస‌న్ సినిమా స్ఫూర్తి… తెర‌వెన‌క క‌థ ఇదే…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు కేవ‌లం 21 ఏళ్ల వ‌య‌స్సులో తిరుగులేని స్టార్‌డ‌మ్ తెచ్చిపెట్టిన సినిమా సింహాద్రి. అప్ప‌టికే స్టూడెంట్ నెంబ‌ర్ 1, ఆది లాంటి హిట్ సినిమాల‌తో తెలుగు జ‌నాల్లో బుడ్డ ఎన్టీవోడు వ‌చ్చేశాడ్రా అన్న చ‌ర్చ స్టార్ట్ అయ్యింది. ఇక సింహాద్రి సినిమాతో ఎన్టీఆర్‌కు తిరుగులేని స్టార్‌డ‌మ్ వ‌చ్చేసింది. ఆ త‌ర్వాత ఎన్ని హిట్ సినిమాలు చేసినా ఎన్టీఆర్‌ను సింహాద్రి రేంజ్‌లోనే ఊహించుకోవ‌డం కూడా మ‌నోడికి కాస్త మైన‌స్ అయ్యింది.

కేవ‌లం 20 ఏళ్ల వ‌య‌స్సులో ఎన్టీఆర్ అప్ప‌టి స్టార్ హీరోల‌ను ప‌క్క‌న పెట్టేసి నెంబ‌ర్ 1 కుర్చీ కోసం పోటీప‌డ్డాడు. రాజ‌మౌళి రెండో సినిమాగా తెర‌కెక్కిన సింహాద్రి జూలై 9, 2003లో రిలీజ్ అయ్యింది. వీఎంసీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై వి. దొర‌స్వామి రాజు ఈ సినిమాను నిర్మించారు. అయితే సింహాద్రి సినిమా వెన‌క తెర‌వెన‌క చాలా త‌తంగ‌మే న‌డిచింది. ఆ ఆస‌క్తిక‌ర విశేషాలేంటో చూద్దాం. ఈ సినిమాకు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాదే స్వ‌యంగా స్టోరీ ఇచ్చారు.

ఈ క‌థ‌ను ఆయ‌న ఎప్పుడో రెడీ చేసుకున్నారు. బి. గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య హీరోగా ఈ సినిమా చేయాల్సి ఉంది. అయితే వాళ్లు ప‌ల‌నాటి బ్ర‌హ్మ‌నాయుడు సినిమా చేస్తున్నారు. మ‌ళ్లీ అదే త‌ర‌హా ఫ్యాక్ష‌న్ క‌థ‌తో సినిమా చేయ‌డం వాళ్ల‌కు ఇష్టం లేదు. అయితే సీడెడ్‌లో టాప్ డిస్ట్రిబ్యూట‌ర్‌గా ఉన్న దొర‌స్వామిరాజుకు ఓ సినిమా చేయాలి రాజ‌మౌళి. త‌న కొడుకుతో సినిమా చేస్తే ఈ క‌థ ఇస్తాన‌ని విజ‌యేంద్ర ప్ర‌సాద్ చెప్ప‌డం.. అటు బాల‌య్య నో చెప్ప‌డంతో స‌డెన్‌గా ఎన్టీఆర్ ఈ సినిమాలోకి రావ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.

ఈ క‌థ ఎలా పుట్టిందంటే…
ఈ క‌థ చెన్నైలో పుట్టింది. విజ‌యేంద్ర ప్ర‌సాద్ త‌న అసిస్టెంట్‌తో క‌లిసి వ‌సంత కోకిల సినిమా చూస్తున్న‌ప్పుడు సింహాద్రి ఆలోచ‌న ఆయ‌న మ‌దిలో పుట్టింది. క్లైమాక్స్‌లో క‌మ‌ల్‌హాస‌న్‌ను చూసి శ్రీదేవి గుండెల్లో గుచ్చేసి వెళ్లిపోతుంది. త‌న అసిస్టెంట్‌తో విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ దీని గురించి చ‌ర్చిస్తూ ఇదే ఇంట‌ర్వెల్ సీన్‌గా చేసి క‌థ రాయ‌డం స్టార్ట్ చేశార‌ట విజ‌యేంద్ర ప్ర‌సాద్‌. అందుకే ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో భూమిక జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను గుండెల్లో గుచ్చేస్తుంది. దాని చుట్టూనే క‌థ అల్లుకున్నారు.

ఈ క‌థ ముందుగా బాల‌య్య‌కు వినిపించ‌గా.. ఒకే టైంలో రెండు ఫ్యాక్ష‌న్ సినిమాలు చేసేందుకు ఆయ‌న ఇష్ట‌ప‌డ‌లేదు. స‌డెన్‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో ఈ సినిమా చేయాల‌ని అనుకున్నారు. అయితే వాస్త‌వంగా 20 ఏళ్ల వ‌య‌స్సులో ఇంత బ‌ల‌మైన క‌థ‌ను ఎన్టీఆర్ మోస్తాడా ? ఆ సీన్ల‌లో న‌టిస్తాడా ? అన్న డౌట్లు రాజ‌మౌళికి ఉండేవి. అయితే ఎన్టీఆర్ త‌న న‌ట‌న‌తో ఆ అనుమానాల‌ను ప‌టాపంచ‌లు చేసి ప‌డేశాడు. ఇక సింహాద్రి ఫైన‌ల్ బాక్సాఫీస్ క‌లెక్ష‌న్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

నైజాం: 6.47 కోట్లు
సీడెడ్: 5.50 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.32 కోట్లు
ఈస్ట్: 1.80 కోట్లు
వెస్ట్: 1.70 కోట్లు
గుంటూరు: 2.20 కోట్లు
కృష్ణా: 1.86 కోట్లు
నెల్లూరు: 1.30 కోట్లు
————————————–
ఏపీ + తెలంగాణ = 23.15 కోట్లు
————————————–
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 2.25 కోట్లు
——————————
వరల్డ్ వైడ్: 25.40 కోట్లు
————————————–

2003లోనే ఈ సినిమాకు రు 11.4 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. వ‌సూళ్లు రు. 25 కోట్ల‌కుపైనే జ‌రిగాయి. బ‌య్య‌ర్ల‌కు ఈ సినిమా ద్వారా రు. 14 కోట్ల భారీ లాభాలు వ‌చ్చాయి. సింహాద్రి త‌ర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్ రేంజ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news